చిత్రం: సీతయ్య (2003)
రచన: చంద్రబోస్
గానం: విజయ్ యేసుదాస్, సునీత
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
సమయానికి తగు సేవలు సేయని.. నీ శ్రీవారిని..
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని..
ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని
ఇక సేవించని ఈ శ్రీవారిని
సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని
చరణం : 1
నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగలమించు బాహు బంధాలతో
చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో
అర్ధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో
నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ
సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని
చరణం : 2
కలతలేని లోకంలో దిష్టి పడని దీవిలో
చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు
ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ
అనుబంధమే బంధువై మమతలే ముత్తైదువలై
ఆనందబాష్పాలై అనుకోని అతిధులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో
కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ జో జోలాలి సేవ
శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని
శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని
కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని
ఈ కౌగిళ్ళలో కలిసుండాలని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి