Seethayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Seethayya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2024, ఆదివారం

Seethayya (Seethaiah) : Okka Magaadu Song Lyrics (పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: ఎం. ఎం. కీరవాణి , అనురాధ శ్రీరామ్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ సో శాడ్ పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నానూ ఈజ్ ఇట్ ఊఁ ఏడ తానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడూ అంత స్పెసలా ఊఁ నా ఊహలో అందగాడు నాన్చొద్దూ… సుఘునాభి రాముడు సమరానా భీముడు ఎవరు ఎవరూ అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు

చరణం : 1

జీన్స్ ప్యాంటు కట్టినా గల్లలుంగి చుట్టినా నీటుగాడు జానపదుల పాటైనా జాగువీత రూటైన ఆటగాడు మగువలకే మరుడు మదనుడికే గురుడు మాటలు తను అనడు చేతలకిక ధనుడు ముక్కుమీద కోపం వాడు ముక్కుసూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేశాడూ అతల వితల సుతల సత్యభూతల భువనాలన్ని ప్రణవిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన తనలో మెదిలే మొనగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు

చరణం : 2

ఆకుచాటు పిందైన ఆకశంలో చుక్కైనా వేటగాడు లక్షమంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు మగసిరి గల రేడు మనసున పసివాడు శతమత గజ బలుడు అతనికి ఎదురెవడు పాత సినిమా హీరో లాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడూ శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శ్రుంగారాని రసదేవా దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు సుఘునాభి రాముడు సమరానా భీముడు ఎవరు ఎవరూ అతగాడు

ఒక్క మగాడు ఒక్క మగాడు ఆంధ్రుల తనయుడు అనితర సాద్యుడు నా కథ నడిపే నాయుకుడూ ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు డూ డు డు డు డు డు డు డు డు డు డు డు ఒక్క మగాడు ఒక్క మగాడు డురు డురు డురు డు డు డు డు డు డు డు డు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క ఒక్క మగాడు


Seethayya (Seethaiah) : Samayaniki Tagu Sevalu Song Lyrics (సమయానికి తగు సేవలు సేయని)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: విజయ్ యేసుదాస్, సునీత

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

సమయానికి తగు సేవలు సేయని.. నీ శ్రీవారిని..

సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని..

ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని

ఇక సేవించని ఈ శ్రీవారిని

సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని


చరణం : 1

నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో

చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో

శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ

బంగారు నగలమించు బాహు బంధాలతో

చలువ చందనాలు మించు చల్లని నా చూపుతో

అర్ధాంగికి జరిగేను అలంకార సేవ

అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ బువ్వతో

నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో

నా పాపకు జరిగేను నైవేద్య సేవ నైవేద్య సేవ

సమయానికి తగు సేవలు సేయని శ్రీవారిని


చరణం : 2

కలతలేని లోకంలో దిష్టి పడని దీవిలో

చెడు చేరని చోటులో ప్రశాంత పర్ణశాలలు

ఈ కాంతకు జరిగేను ఏకాంత సేవ

అనుబంధమే బంధువై మమతలే ముత్తైదువలై

ఆనందబాష్పాలై అనుకోని అతిధులై

సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ

నులివెచ్చని నా ఎదపై పరిచేటి పాన్పులో

కనురెప్పల వింద్యామర విసిరేటి గాలితో

చూలాలికి జరిగేను జోలాలి సేవ జో జోలాలి సేవ

శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని

శ్రీవారికి ఒక మనవిని సేయని ఈ ప్రియ దాసిని

కను తెరవగ మీ రూపే చూడాలని మీ కౌగిళ్ళలో కను మూయాలని

ఈ కౌగిళ్ళలో కలిసుండాలని



Seethayya (Seethaiah) : Amma Thodu Nanna Thodu Song Lyrics (ఓ పిల్లా... ఓ... పిల్లా..)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: ఉదిత్ నారాయణ్ , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

ఓ పిల్లా... ఓ... పిల్లా... (2) అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా... (2) మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా వదలను నిన్నే ఓ పిల్లా... ఓ రాజా... ఓ... రాజా... కొమ్మతోడు రెమ్మతోడు కట్టుకు వచ్చిన కోక తోడు మరువను నిన్నే ఓ రాజా... ఓ రాజా... ఓ... రాజా...

చరణం : 1

నీ తోడుంటే దీపావళి... నువు ఊవ్ అంటే ధూపావళి ఒక్కరు ఉంటే ఏకాదశి జంటైతే కేకాదశి సయ్యంటే ప్రతి సంధ్యకి సుఖాల సంక్రాంతి నువ్వుంటే ప్రతి రాతిరి అయ్యేను నవరాత్రి నా తీగను అల్లితే నాగుల పంచమిలే నీ సోకులు అందితే గోకుల అష్టమిలే బ్రతకుంతా సీతారాముల నవమే ఓ పిల్లా... ఓ... పిల్లా... అమ్మతోడు నాన్నతోడు నినుపుట్టించిన బ్రహ్మతోడు వదలను నిన్నే ఓ పిల్లా

చరణం : 2

బిడియాలతో బిల్లంగోడు పిల్లా నేడే ఆడేయనా వయ్యారంతో వామనగుంటా ఆడించి ఓడించవా పెదాల కోలాటాలే ఈవేళ ఆడాలి గదుల్లో కోతికొమ్మ గలాటా చూడాలి చలి దాగుడుమూతల ఆటకు ముందుకు రా నను గుజగుజ రేకుల ఆటకు గుంజకురా మనువాటే ఆడి మొగుడై పోరా ఓ రాజా... ॥రాజా॥ ఏ కొమ్మ కాదన్నా ఏ రెమ్మ కాదన్నా నా కోకే కాదన్నా మరువను నిన్నే ఓ రాజా... ఓ పిల్లా... ఓ పిల్లా

Seethayya (Seethaiah) : Siggestundi Ninu Chustunte Song Lyrics (సిగ్గేస్తోంది నిను చూస్తుంటే)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: ఎం. ఎం. కీరవాణి , శ్రేయ ఘోషల్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో వుంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యొ....కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో గుప్పెడు సిగ్గు ఒళ్ళంత ఒకటే సిగ్గు

చరణం:1

ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటె అయ్బాబోయ్ సిగ్గు ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటె అడ్డగోలు సిగ్గు కొ కొ కొకొకొ కొకొకొకొ కొకొకొ కలాగుతుంటె సిగ్గు చి చి చిచిచి చిచిచి చిలిపి సైగచేస్తె సిగ్గు వెలపుల సిగ్గు లొలోపల సిగ్గు శిగపూవై వున్నోడు బుగ్గంత తడిమేస్తుంటె సిగ్గు....

చరణం:2

రాతిరి తాను నిద్దర మాని నా కలలోనె తిరిగేస్తుంటె వొరినాయనో సిగ్గు కలలో కలిగిన అలసటతో నా వొళ్ళోనె నిదురిస్తానంటె ఎక్కడ్లేని సిగ్గు ఒ ఒ ఒ ఊఊ ఊఒ ఊహ తరుముతుంటె సిగ్గు అ అ అ ఆఅ ఆ ఆశ కలుగుతుంటె సిగ్గు తొలుతలొ సిగ్గు నను తొలిచిన సిగ్గు చిదిమేసె చిన్నోడికి సిగ్గంటు చెప్పాలంటె సిగ్గు.

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో వుంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యొ....కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో గుప్పెడు సిగ్గు ఒళ్ళంత ఒకటే సిగ్గు...

30, జులై 2021, శుక్రవారం

Seethayya (Seethaiah) : Bus ekki vastavo Railu ekki vasthavo Car ekki vasthavo Song Lyrics (బస్సెక్కి వస్తావో)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

ఆ: బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో    బస్సెక్కి వస్తావో ....బండెక్కి వస్తావో....కారెక్కి వస్తావో....లారెక్కి వస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా

అ: రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో     రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా

చరణం:1

అ: మావా అంటే మాపటికి మనసిస్తానే ఆ: మావా మమా మావా అ: బావా అంటే బ్రహ్మండం చూపిస్తానే ఆ: బావా ఆ: పోరీ అంటే పొద్దంతా ప్రేమిస్తాలే అ: ఏయ్ పోరీ ఆ: రాణి అంటే రాత్రికి నిను రానిస్తాలే  అ: ఏమోయ్ అంటే ఏమే అంటు...ఏమేమో చేస్తానే ఆ: సతీ అంటే పతీ అంటూ ప్రతిదీ అందిస్తాలే.... ఎట్టాగైనా నను ఎట్టాగైనా ఎట్టాగైనా పిలిచేసుకో... నా పట్టుతేనె పిండేసికో.... అ: ఏపియస్సార్టీసీ బస్సెక్కివస్తానే బండెక్కివస్తాను కారెక్కివస్తాను లారీఎక్కొస్తాను ఆ: ఏదైనా ఎక్కేసిరా నా ఎదలోన పక్కేస్తారా అ: ఓకే ఆ:ఏదైనా ఎక్కేసి రావయ్ వయ్ రావయ్ రా నా ఎదలోన పక్కేస్తారా అ: ఓయ్యస్

చరణం:2

అ: కన్నే కొడితే మెరుపల్లే ముందుంటానే ఆ: హాయ్ హాయ్  అ:యీలే వేస్తే గాలల్లే అల్లేస్తానే ఆ: అబ్బబ్బో ఆ: నవ్వే నవ్వితే నడిచొచ్చి నడుమిస్తాలే అ; అబ్బో ఆ: చెయ్యే వుపితే చిలకలని చుట్టిస్తాలే.... అ పైటే దువ్వి బయటేపడితే పైపైకే వస్తానే ఆ:కాలే దువ్వి కబురే పెడితే ప్రువపు పరుపేస్తాలే ఎల్లాగైనా...యిక ఎల్లాగైనా  ఎల్లాగైనా కవ్వించుకో నన్ను ఎల్ల కాలం కాపాడుకో     

అ: రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో     రాముడై వస్తానో భీముడై వస్తానో కాముడై వస్తానో కృష్ణుడై వస్తానో ఆ: ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా ఏ వేషంలో వచ్చినా... నీ ఆవేశం తగ్గించనా