22, మార్చి 2024, శుక్రవారం

Uma Maheswara Ugra Roopasya : Nuvvemo Song Lyrics (నువ్వేమో రెక్కలు చాచి)

చిత్రం: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2003)

రచన: రెహమాన్

గానం: కాలభైరవ, సితార

సంగీతం: బిజిబాల్



పల్లవి :

నువ్వేమో రెక్కలు చాచి రివ్వున లేచిన పక్షయ్యి పైకి ఎగిరి పోయావే నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టై ఇక్కడనే ఉన్నానే కోరుకున్న లోకాలు చూడ ఈ కొనను విడిచి పోతే ఎలా కొమ్మలన్నీ శోకాలు తీస్తూ కుంగాయి లోలోపల ఇక నా లోకమొ నీ లోకమో ఒకటెట్టా అవుతాది

చరణం 1 :

కసిగా కసిరే ఈ ఎండలే నీ తలపులుగా ఈ కలతలుగా నిసిగా ముసిరే నా గుండె నే పగటి కళలు ముగిసేలా వెలుగే కరిగి పోయింది లే ఉసిరే నలిగి పోయింది లే ఆశలల్లే ఆకులే రాలి మనసే పెళుసై విరిగిపోయేలే మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే చేతిలో గీతలు రాతలు మారిపోయే చూడు మాయదారినే ఊగే కొమ్మకు సాగే పిట్టకు ఒంటె ఎలికి పేరేంటనా పూసే పులకి వీచే గాలికి స్నేహం ఎన్నాలట

చరణం 2 :

నేనేమో ఎల్లలు ధాటి నచ్చిన దారిన ముందుకు సాగేటి ఓ దాహం… నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని అద్దంలా మెరిసే ఓ స్నేహం… తప్పదంటూ నీతోనే ఉండి నీ మనసు ఒప్పించలేను మరి తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని నిన్ను నీలాగానే చూడడని దూరంగా వెళ్తున్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి