Uma Maheswara Ugra Roopasya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Uma Maheswara Ugra Roopasya లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2024, శుక్రవారం

Uma Maheswara Ugra Roopasya : Nuvvemo Song Lyrics (నువ్వేమో రెక్కలు చాచి)

చిత్రం: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2003)

రచన: రెహమాన్

గానం: కాలభైరవ, సితార

సంగీతం: బిజిబాల్



పల్లవి :

నువ్వేమో రెక్కలు చాచి రివ్వున లేచిన పక్షయ్యి పైకి ఎగిరి పోయావే నెనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టై ఇక్కడనే ఉన్నానే కోరుకున్న లోకాలు చూడ ఈ కొనను విడిచి పోతే ఎలా కొమ్మలన్నీ శోకాలు తీస్తూ కుంగాయి లోలోపల ఇక నా లోకమొ నీ లోకమో ఒకటెట్టా అవుతాది

చరణం 1 :

కసిగా కసిరే ఈ ఎండలే నీ తలపులుగా ఈ కలతలుగా నిసిగా ముసిరే నా గుండె నే పగటి కళలు ముగిసేలా వెలుగే కరిగి పోయింది లే ఉసిరే నలిగి పోయింది లే ఆశలల్లే ఆకులే రాలి మనసే పెళుసై విరిగిపోయేలే మాటలన్నీ గాలి మూటలై పగిలి పోయాయిలే చేతిలో గీతలు రాతలు మారిపోయే చూడు మాయదారినే ఊగే కొమ్మకు సాగే పిట్టకు ఒంటె ఎలికి పేరేంటనా పూసే పులకి వీచే గాలికి స్నేహం ఎన్నాలట

చరణం 2 :

నేనేమో ఎల్లలు ధాటి నచ్చిన దారిన ముందుకు సాగేటి ఓ దాహం… నువ్వేమో మచ్చలు లేని మబ్బులు పట్టని అద్దంలా మెరిసే ఓ స్నేహం… తప్పదంటూ నీతోనే ఉండి నీ మనసు ఒప్పించలేను మరి తప్పలేదు తప్పని సరై ఎంచాను ఈ దారిని నిన్ను నీలాగానే చూడడని దూరంగా వెళ్తున్న

Uma Maheswara Ugra Roopasya : Repavalu Song Lyrics (రేపవలు వెకనుల)

చిత్రం: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020)

రచన: రెహమాన్, రఘుకుల్ మొకిరాల

గానం: బిజిబాల్ & సంగీత శ్రీకాంత్.

సంగీతం: బిజిబాల్




రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న లా ల ల లా ల ల ల లా ల ల నా తనివి తీరదుగా ఎన్నాలైన రావా ల ల నీవే ల ల మరల కురిసే వరములు తేవ ఆ… లోకాన ప్రేమంతా రూపాన వేరైనా చేరేటి తీరాన నీవా ల ల ల ల కాలనాపి నాతో ఉండి పోవా రేపవలు వెకనుల నిన్నే చూస్తున్న నా తనివి తీరదుగా ఎన్నాలైన సమయం పరుగున కదిలే మలుపులు తిరిగే చక చక ఎన్నో మారేలే అయినా తొలకరి చెలిమె తొనకని గుణమే చెరగని నవ్వాయి తాకేలే నీ చూపు నా వైపు చూస్తుంటే చూసాను నీలోని కేరింతే ఇంకా అలాగే ఎలాగో ఈ పసితనం ఎదలో తొలి పరవశమే కలిగిన క్షణమే కరగక కాలంతో పాటే ఎదిగే ప్రతి ఒక దినమే గురుతుల వనమే పెరిగెను దురంతో పాటే ఏమైనా మారేనా నా నిన్న నాలానే నేడున్న రేపైనా ఇంతే ప్రపంచం సమస్తం ఈ మనిషికి నా మనసు నీ కొరకు శిల్పంలా ఉన్న నీ తలపులో మునిగి జీవిస్తున్న నిన్న నేడై కలిసి మురిసే క్షణములలోన ఈ దూర భారాలు ఇన్నాళ్ల మౌనాలు తీరేటి దారేదో చూపి ప్రాణంలోనా పాటై నిండిపోవా

Uma Maheswara Ugra Roopasya : Ningi Chutte Song Lyrics (నింగి చుట్టే మేఘం ఎరుగదా..)

చిత్రం: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020)

రచన: విశ్వా

గానం: విజయ్ యేసుదాస్

సంగీతం: బిజిబాల్



పల్లవి :

నింగి చుట్టే మేఘం ఎరుగదా.. ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా.. తారావాసాల ఊసుల్ని వీడి… చూసింది ఓసారి సగటుల కనికట్టు… నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా.. ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా.. తారావాసాల ఊసుల్ని వీడి… చూసింది ఓసారి సగటుల కనికట్టు…

చరణం 1 :

తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ.. తమదైన తృణమైన చాలను వరస… ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు.. ఎనలేని కధనాలు.. చోటిది బహుశా… ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత.. తెలియదుగా… సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ.. నింగి చుట్టే.. మేఘం ఎరుగదా..ఈ లోకం గుట్టు.. మునిలా, మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో.. జోడి కట్టు..

చరణం 2 :

సిసలైన సరదాలు.. పడిలేచే పయనాలు.. తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస… విసుగేది దరిరాని.. విధిరాత కదిలేని.. శతకోటి సహనాల.. నడవడి తెలుసా… చిత్రంగ, కలివిడి సూత్రంగ.. కనపడే ప్రేమ పంతం తమ సిరిగా, సాగింది ఈ తీరు.. సగతుల కనికట్టు… నింగి చుట్టే.. చుట్టే.. మేఘం ఎరుగదా.. ఎరుగదా ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా.. తారావాసాల ఊసుల్ని వీడి… చూసింది ఓసారి సగటుల కనికట్టు…