చిత్రం:వేట (1986)
రచన: వేటూరి
గానం: కె.జె.ఏసుదాస్
సంగీతం: కె. చక్రవర్తి
పల్లవి:: ఓ లేడి కూన..ఈ వేటలోన అలిసేవు..పరుగులోన ఓ లేడి కూన..ఈ వేటలోన అలిసేవు..పరుగులోన ఎవరూ....తోడు రారు అడివె....నీకు తోడు విధి నిను తరిమిన ఈ ఆట... వేట చరణం::1 పసుపు కుంకుమలు ఒకవైపు ప్రేమ సంకెలలు ఒకవైపు పసుపు కుంకుమలు ఒకవైపు ప్రేమ సంకెలలు ఒకవైపు జరిగే.. ఈ సంకుల సమరంలో... కన్నీరే.. మిగిలేను బ్రతుకంతా ఇక రగిలేను ఏ రక్కసి..వికృత హాసమిది.... ఏ కర్కశ..ముష్కర హస్తమిది... ఇది కత్తుల..బోనమ్మా... ఇది నెత్తుటి..వానమ్మా... ఓ లేడి కూన..ఈ వేటలోన అలిసేవు...పరుగులోన చరణం::2 నమ్మిన నెచ్చెలి కోసమని ఆశను ఊపిరి చేసుకుని నమ్మిన నెచ్చెలి కోసమని ఆశను ఊపిరి చేసుకుని నరకా..న్ని గెలిచినా ఫలితమిదా గెలుపంతా ఓటమని చెలి వలపంతా మోసమని. తెలిసిన హృదయం పగిలేను.. పగతో సెగలై ఎగసేను.. ఇది విషనాగుల లోకం కసి బుస కొట్టే కాలం ఓ లేడి కూన..ఈ వేటలోన అలిసేవు..పరుగులోన ఎవరూ..తోడు రారు అడివె..నీకు తోడు విధి నిను తరిమిన..ఈ ఆట వేట ఓ లేడి కూన..ఈ వేటలోన అలిసేవు..పరుగులోన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి