19, మార్చి 2024, మంగళవారం

Shivaranjani : Abhinava Tharavo Song Lyrics (అభినవ తారవో.)

చిత్రం: శివరంజని (1978)

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు


పల్లవి:

అభినవ తారవో... నా... అభిమాన తారవో.. అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ శివరంజనీ.. శివరంజనీ..

అది దరహాసమా మరి మధుమాసమా అది దరహాసమా మరి మధుమాసమా ఆ మరునికి దొరికిన అవకాశమా అవి చరణమ్ములా శశికిరణమ్ములా నా తరుణభావన హరిణమ్ములా..

అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో

చరణం 1: ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నయనాలు విరిసిన చాలు అమవస నిశిలో చంద్రోదయాలు ఆ నెన్నడుము ఆడినచాలు ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రబంధాలు

అభినవ తారవో... నా... అభిమాన తారవో.. అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ శివరంజనీ... శివరంజనీ..

చరణం 2:

నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన వీరమా... నీ కుపిత నేత్ర సంచారమే హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ ఆ.ఆ.ఆ. నే ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను.నీ ప్రియభక్తుడను

అభినవ తారవో... నా... అభిమాన తారవో.. అభినవ తారవో.. అభినయ రసమయ కాంతిధారవో అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాల సుమశర శింజినీ శివరంజనీ.. శివరంజనీ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి