2, ఏప్రిల్ 2024, మంగళవారం

HanuMan : Poolamme Pilla Song Lyrics (పూలమ్మే పిల్లా)

చిత్రం: హనుమాన్ (2024)

రచన: కాసర్ల శ్యామ్

గానం: గౌరహరి

సంగీతం: గౌరహరి



పల్లవి :

పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా గుండెను ఇల్లా దండగా అల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా అమ్మాయి జళ్ళో చేరేది ఎల్లా పూలమ్మే పిల్లా మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

చరణం : 1 పిల్ల పల్లేరు కాయ సూపుల్ల సిక్కి అల్లాడినానే సేపల్లా పసిడి పచ్చాని అరసేతుల్లా దారపోస్తా ప్రాణాలు తానే అడగాల సీతాకోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా హే మల్లి, అందాల సెండుమల్లి గంధాలు మీద జల్లి నను ముంచి వేసెనే తనపై మనసు జారి వచ్ఛా ఏరి కొరి మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

చరణం : 2

పిల్ల అల్లాడిపోయి నీ వల్లా ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియ్యే మూడు పూటల్లా ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా తుళ్ళీ ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా హే తెల్ల, తెల్లాని కోటు పిల్ల దాచేసి జేబులల్ల నను మోసుకెళ్ళవే పట్నం సందమామ సిన్న నాటి ప్రేమ పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా అమ్మాయి జళ్ళో చేరేది ఎల్లా పూలమ్మే పిల్లా మూరెడు పూలే మా రాణికీవే చారేడు చంపల్లే సురీడై పూసెలే ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి