చిత్రం: మాస్(2004)
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కార్తీక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి:
నాఆఆ బూరె లాంటి బుగ్గ చూడు
కారు మబ్బు లాంటి కురులు చూడు
వారెయ్ వ క్యా హైర్సటైల్ యార్
అన్న సూపర్ అన్న కంటిన్యూ కంటిన్యూ
హే ఓఓఓఓ వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి
ఓఓఓఓ బూరె బుగ్గ బంగారి చాప కళ్ళ చిన్నారి
బుంగ మూతి ప్యారి నంగనాచి నారి లవ్ చెయ్యి ఓ సారి
హ నిన్ను చూసినాక ఏమయిందో పోరి
వింత వింతగా ఉంటోంది ఏమిటో ఈ స్టోరీ
నువ్వు కనబడ కుంటే తోచదే కుమారి
నువ్వు వొస్తే మనసంతా స రి గ మా ప గ రి
హో వాలు కళ్ళ వయ్యారి తేనే కళ్ళ సింగారి
నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి
నన్ను ముంచినవే దేవేరి
చరణం:1
నీ హృదయం లో నాకింత చోటిస్తే దేవతల్లే చూసుకుంటా నీకు ప్రాణమైన రాసి ఇస్తా ఆలా కోపంగా నా వైపు నువ్వు చూస్తే దీవానల్లే మార్చుకుంట దాని ప్రేమ లాగ స్వీకరిస్తా నా కోసం పుట్టినవాని నా మనసే చెప్పినది లే ఈ బంధం ఎప్పుడో ఇలా పై వాడు వేసినాడు లే ఒప్పుకో తప్పదు ఇప్పుడు ఇక్కడే నీకు నేను ఇష్టమేనని హో వాలు కాళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి ) తేనే కళ్ళ సింగారి (తేనే కళ్ళ సింగారి ) నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి నన్ను ముంచినవే దేవేరి
చరణం:2
వ హో వ హో వ హో వ కుర్రాడు మంచివాడు గ ఒప్పుకో వ హో వ హో వ హూ వ హో ఆరడుగులు అందగాడు ఒప్పుకో ఈ ముద్దుగుమ్మే నా వైఫ్ గ వస్తే బంతిపూల దారి వేస్తా లేత పాదమింకా కందకుండా ఈ జాబిలమ్మే నా లైఫ్ లోకొస్తే దిష్టి తీసి హారతిస్తా ఏ పాడుకళ్లు చూడకుండా నాలాంటి మంచివాడిని మీరంతా చూసి ఉండరే ఆ మాటే మీరు ఈమె తో ఓ సారి చెప్పి చూడరే ఒప్పుకో తప్పదే ఇప్పుడే ఇక్కడే నువ్వు నాకు సొంతమే నని హో వాలు కళ్ళ వయ్యారి (వాలు కాళ్ళ వయ్యారి ) తేనే కళ్ళ సింగారి ( తేనే కళ్ళ సింగారి ) నా గుండెలోకి దూరి మనసు లోకి జారీ చంపినావే కావేరి నన్ను ముంచినావే దేవేరి (దేవేరి )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి