7, ఏప్రిల్ 2024, ఆదివారం

Nindu Punnami Vela Folk Song Lyrics (నిండు పున్నమి వేళ )

నిండు పున్నమి వేళ (2022)

రచన: సుమన్ బదనకల్

గానం: సుమన్ బదనకల్, శ్రీనిధి

సంగీతం: కళ్యాణ్ కీస్



పల్లవి:

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే.... కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా..... నా ఊహల రాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్ననే... కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకున్ననే....

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే.... కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా..... చరణం 1:

సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నేమలమ్మ నృత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే.... మాటలే మత్తులు సుపుల సూదులు గుండెల్లో గుచ్చకురా ఓ పిలగా నన్నేదో సెయ్యకురా.... పచ్చి పాల తీరు నీ లేత నవ్వులు ఎంత ముద్దుగున్నవే... నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్ల నే విడువనే....

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే.... కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా..... చరణం 2:

తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడసక్కని గుమ్మవే... కను సైగ జేస్తావు నాయెంట వస్తావు మావొల్లు జుస్తరుర ఓ పిలగా నన్నిడిసి వెళ్ళిపోరా.... ఆ రంభ ఊర్వశి ఈ నేల జారీ నీల మారెనేమొనే.... ఏ జన్మలో జేసిన పుణ్యమో నువ్వు మరిసి ఉండలేనులే...

నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే.... కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలరా ఓ పిలగ సాలించు నీ మాటరా..... చరణం 3:

ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి నన్ను అడుగుతున్నవే ఓ పిల్ల నిన్ను కొరుతున్నవే... మాయేదో జేసినవ్ నా మనసు దోసినవ్ నా లోకమైనావురా ఓ పిలగ నీ మీద మనసాయెరా... నా సిక్కని ప్రేమల సక్కని దేవతగా నిన్ను కొలుసుకుంటనే... అడుగుల్ల అడుగేసి నీలోన సగమైయ్యి నిన్ను చూసుకుంటనే.... ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే... ఏడేడు జన్మల విడిపోని బంధమై నీ తోడు నేనుంటరా ఓ పిలగా కలకాలం కలిసుంటారా...



3 కామెంట్‌లు: