18, మే 2024, శనివారం

Gharshana : Andagada Andagada song lyrics (అందగాడా అందగాడా)

చిత్రం: ఘర్షణ (2004)

రచన: కుల శేఖర్

గానం: హరిణి

సంగీతం: హర్రీస్ జయరాజ్



పల్లవి:

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

చరణం:1

గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందంచందం అంతా నీ కోసం తోడే లేదనీ కాలే కౌగిలీ ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతోదురం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

చరణం:2

జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీరూపం ఏనాడు లేనే లేదు ఈ మైకం నాలో శ్వాసకీ రేగే ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం రాగమై సాగెనే అంతులేని ఆనందం మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి