Gharshana(2004) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gharshana(2004) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2024, శనివారం

Gharshana : Andagada Andagada song lyrics (అందగాడా అందగాడా)

చిత్రం: ఘర్షణ (2004)

రచన: కుల శేఖర్

గానం: హరిణి

సంగీతం: హర్రీస్ జయరాజ్



పల్లవి:

అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

చరణం:1

గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం నా అందంచందం అంతా నీ కోసం తోడే లేదనీ కాలే కౌగిలీ ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతోదురం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

చరణం:2

జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీరూపం ఏనాడు లేనే లేదు ఈ మైకం నాలో శ్వాసకీ రేగే ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈ లోకం నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం రాగమై సాగెనే అంతులేని ఆనందం మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా


28, డిసెంబర్ 2021, మంగళవారం

Gharshana : Cheliya Cheliya Song Lyrics (చెలియా చెలియా)

చిత్రం: ఘర్షణ (2004)

రచన: కుల శేఖర్

గానం: కే.కే , సుచిత్ర

సంగీతం: హర్రీస్ జయరాజ్


చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న

చిగురు యదలో చిటిగామారినది విరహా జ్వాలా సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా

చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న



శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలిరావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం

జాలి నాపై కలగదేమే జాఢ్యాయినా తెలియడమే ప్రతిక్షణం మనసిలా వెతికేనే నీకోసం

ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా

చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న


గుండెలోన వలపు గాయం మాన్తా రేపే పిదప కాలం ప్రాణాయామా ప్రాణాయామా తెలుసునా నీకైనా

దూరమైనా చెలిమి దీపం భారమైనా బ్రతుకు శాపం ప్రియతమా హృదయమా తరలిరా నేదైనా

కలవు కావా నా కన్నుల్లో నిముషమైన నీ కౌగిలిలో సేద తీరాలి చేరవా నేస్తమా


చెలియా చెలియా చెలియా చెలియా

అలల ఒడిలో ఎదురుచూస్తున్నా

తనువు నదిలో మునిగివున్న

చెమట జడీలో తడిసిపోతున్న

చిగురు యదలో చిటిగామారినది విరహా జ్వాలా సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో

కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా..ప్రియతమా





18, నవంబర్ 2021, గురువారం

Gharshana : Ye Chilipi Song Lyrics (ఏ చిలిపి కళ్ళలోన)

చిత్రం: ఘర్షణ (2004)

రచన: కుల శేఖర్

గానం: శ్రీనివాస్

సంగీతం: హర్రీస్ జయరాజ్


ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. కరిమబ్బుల్లోనా విల్లువో .. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఈ పరిమళము నీదేనా.. నాలో పరవశము నిజమేనా.. బొండు మల్లిపువ్వు కన్నా తేలికగు నీ సోకు.. రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు.. సొగసుని చూసి పాడగా ఎలా.. కనులకు మాట రాదుగా హలా..  వింతల్లొను కొత్త వింత నువ్వేనా.. ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే..  ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్ ... ఆ పరుగులలో పరవళ్ళు.. తూలే కులుకులలో కొడవళ్ళు.. నిన్ను చూసి వంగుతుంది ఆశ పడి ఆకాశం.. ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం.. స్వరమున గీతి కోయిలా ఇలా.. పరుగులు తీయకే అలా..అలా.. నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం.. నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో .. కరిమబ్బుల్లోనా విల్లువో .. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో..పూల జల్లువో... Movie  :  Gharshana Lyrics  :  Kulasekhar Music  :  Haris Jayaraj Singer :  Srinivas

12, జులై 2021, సోమవారం

Gharshana : Nanne Nanne Chusthu Song (నన్నే నన్నే చూస్తూ)

చిత్రం: ఘర్షణ(2004)

సంగీతం: హర్రిస్ జయరాజ్

సాహిత్యం: కులశేఖర్

గానం: టిప్పు, పాప్ షాలిని



చెలిమను పరిమళం మనసుకి తొలివరం బతుకున అతిశయం వలపను చినుకులే ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరువపు పరుగులే నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె నీకో నిజమే చెప్పన్నా……... నీకో నిజమే చెప్పన్నా నా మదిలో మాటే చెప్పనా యదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా హా..ఒహు వహా..ఒహు వహా..ఏమిటంటారో ఈ మాయని.. ఒహు వహా..ఒహు వహా..ఎవరినడగాలో ప్రేమేనా అని నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె ఇదివరకెరగని స్వరములు పలికెను పగడపు జిలుగుల పెదాల వీణా బిడియములేరగని గడసరి సొగసుకు తమకములేగసేను నరాల లోనా.. హా లోనా ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో నా వాటం మొత్తం ఎంతో మారింది ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది ఒహు వో..ఓ హువా ఒహువా..ఒహువా ఒహువా నన్నే నన్నే మార్చి ని మాటలతో ఏమార్చి ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్ ! కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నోవ్వోచ్చి ఏకంగా బరిలోకే దించావోయ్ !! చేలిమను పరిమళం మనసుకి తొలివరం బతుకున అతిశయం వలపను చినుకులే ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరువపు పరుగులే మనసున అలజడి వలపని తెలిపిన జిలిబిలి పలుకుల చలాకి మైనా కళలను నిజముగ ఎదురుగ నిలిపిన వరముగ దొరికిన వయ్యారి జానా ఓ జాన ఈ లోకం కొత్తగా ఉందయ్యో బొత్తిగా భూగోళం కుడా నేడే పుట్టింది ని వల్లే ఇంతగా మారాలే వింతగా నువ్వంటే నాకు పిచ్చే పట్టింది లా ల ల్లా లా ల ల్లాల ల ల ల్లా ల లా ల ల్లా నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చేయ్యోద్దె సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ యమ్మో అమ్మో ప్రాణం తియ్యోద్దె నీకో నిజమే చెప్పన్నా నా మదిలో మాటే చెప్పనా యెదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి అది నిన్నా మొన్నా లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా హా ఒహు వహా ఒహు వహా ఏమిటంటారు ఈ మాయని ఒహు వహా ఒహు వహా ఎవరినడగాలో ప్రేమేనా అని ప్రేమేనా అని..ప్రేమేనా అని.. ప్రేమేనా అని… ప్రేమేనా అని…