19, అక్టోబర్ 2024, శనివారం

Ardha Shathabdam : Ye Kannulu Choodani Song Lyrics (ఏ కన్నులూ చూడనీ చిత్రమే)

చిత్రం: అర్ధ శతాబ్దం (2021)

సంగీతం: నౌఫల్ రాజా ఎ.ఐ.ఎస్

రచన: రెహమాన్

గానం: సిద్ శ్రీరామ్



పల్లవి:

ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం 1:

ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన దారికాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే

చరణం 2:

సరిమప మపమప మపమప నిమగ పనినిస సరిని సరిమపని సరిని సరిమపని సరిని సరిమపని సమిపస నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి