చిత్రం: అర్ధ శతాబ్దం (2021)
సంగీతం: నౌఫల్ రాజా ఎ.ఐ.ఎస్
రచన: రెహమాన్
గానం: సిద్ శ్రీరామ్
పల్లవి:
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
చరణం 1:
ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారికాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపెలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
చరణం 2:
సరిమప మపమప మపమప నిమగ పనినిస సరిని సరిమపని సరిని సరిమపని సరిని సరిమపని సమిపస నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసి ఓ వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే