చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)
సంగీతం: అనుదీప్ దేవ్
రచన: కృష్ణకాంత్
గానం: కార్తీక్
పల్లవి:
రాదే రాదే అలుపంటు రాదే
ఆడేస్తున్నా ప్రతి పూటే
వాడు వీడు అని తేడాలే లేవే
ఓ చోటే చేరి ఆడామే
అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి
మాటే వినదంటా వయసే
ఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
మా గుండె తిరిగేదాచోటే
అరెరే బాల్యం రమ్మన్న రాదే
గుర్తుకొస్తే కంట చెమ్మ
పెట్టిస్తుటుందే.. స్నేహాలే..
గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
ఆ రోజులు మళ్ళి రావు
ఈరోజుల్లా కానే కావు
అంతే లేని ఆనందాలు
వెంటే వస్తే అంతే చాలు
చరణం 1:
సొంత ఊరిలో కన్న వారితో ఉంటే వేరేలే మనసంతా హాయేలే అంతా మారిన సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నా లోనే దాస్తం మా ప్రేమ బైటే పెట్టే ధైర్యాలే లేవు లే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవ్వర్నైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆ దారే ఆ నాటి మాయే ఏమాయే దేవుడు కనిపించి ఏం కావాలి అంటే మళ్ళి వెళ్తాం మేమంతా చిన్న నాటికే ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి