Committee Kurrollu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Committee Kurrollu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, అక్టోబర్ 2024, శనివారం

Committee Kurrollu : Sandhadi Sandhadi Song Lyrics (సుక్కల జాజిలు జల్లో)

చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)

సంగీతం: అనుదీప్ దేవ్

రచన: సింహాచలం మన్నెల

గానం: అనుదీప్ దేవ్, రేణు కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి




సుక్కల జాజిలు జల్లో చేతిన గాజులు గల్లో కాసుల పేరలు మెల్లో ఊపుకి కుర్రాళ్లు జిల్లో జిల్లో సింగడు రంగడు గుళ్ళో వేషాలు కట్టారు కోలో రేతిరి తెల్లార్లు ఊళ్ళో జువ్వలు పేలాయి గాల్లో గాల్లో డప్పుల మోత జాతర పాట చెవ్వులు గోలెత్తిపోవాల అత్తరు చీర మొగ్గల పంచె ఇస్తీరి మడతడిపోవాల సిన్నోళ్లు పెద్దోళ్లు ఉన్నోళ్లు లేనోళ్లు ఉజ్జీ కట్టి ఊగాల సందడి సందడి సందడి సందడి సందడి చేసే కుర్రాళ్లే డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి దమ్మెర డాన్సులు చెయ్యాలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే సల్లని సుక్కెళ్తే ఒంట్లో నాగిని పూనే నా గంట్లో సూత్తేను హుషారు మాలో మాములుగుండదు పిల్లో పిల్లో పొట్టేలు మొక్కాము తల్లో సల్లంగ సూడాలి నీలో మాలో మా ముందు పెద్దోళ్లు ఆలో ఈలో నీ తంతు నేర్పారు మేలో మాలో అమ్మోరు బూని మేలాలతోని కేకల శివాలెయ్యాల బుట్టలు కట్టి బొట్టులు పెట్టి వరి చాటనే మొయ్యాల ఈ పక్క ఆ పక్క సుట్టూర సుట్టాలు సుట్టూర సుట్టాలు సూపులు సూడగా రావాల సందడి సందడి సందడి సందడి సందడి చేసే కుర్రాళ్లే డబ్బిడి దిబ్బిడి దెబ్బకి బెబ్బులి దమ్మెర డాన్సులు చెయ్యాలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే అమ్మోరు తల్లే లోకాలనేలే అపార శక్తి నువ్వే మా బంగారు తల్లే సల్లంగ సూడే మాకింక ముక్తినివ్వే అమ్మోరు తల్లే నీ సాటి లేరే శతకోటి వందనాలే ఊరమ్మోరు తల్లే నీ పాద ధూలే తొలగించు మా బాధలే

18, అక్టోబర్ 2024, శుక్రవారం

Committee Kurrollu : Gorrela Song Lyrics (నానా బండి తియ్)

చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)

సంగీతం: అనుదీప్ దేవ్

రచన: నాగ్ అర్జున్ రెడ్డి

గానం: అనుదీప్ దేవ్ , వినాయక్ , అఖిల్ చంద్ర , హర్షవర్ధన్ చావలి , ఆదిత్య భీమతాటి , సింధుజా శ్రీనివాసన్ , మనీషా పాండ్రంకి, అర్జున్ విజయ్




నానా బండి తియ్ బాబోయ్ తాగున్నా బండి తీగూడదు మందు తాగి బండే కాదు నానా Vote-u కూడా వెయ్యకూడదు మందుందా ఓయ్ electionలో ఎవడురా నీకు మందు పంచి పెట్టేది అదేంటి అక్కడ A1 గాడు పంచుతున్నాడు కదా మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తుంటారే (మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే) (ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తారే) రోడ్లన్నీ గతుకుల పాలే ఊరంతా చీకటి పాలే Rationలు పించనులన్నీ మొత్తానికి గల్లంతాయే (రోడ్లన్నీ గతుకుల పాలే) (ఊరంతా చీకటి పాలే) (Rationలు పించనులన్నీ) (మొత్తానికి గల్లంతాయే) ఎన్నున్నాయి ఓట్లు నాలుగండి అరే నాలుగంట్రా ఏమోవ్ ఈయన దగ్గర చీరలు కుంకుంబరినాలు తీసుకొని ఓటెయడం కంటే గుడి మెట్ల మీద అడుక్కోవడం చానా మేలు స్వాగో స్వాగు స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు హేయ్ పట్టు చీరల్నే పంచి వెండాభరనాలనే ఇచ్చి ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ (పట్టు చీరల్నే పంచి) (వెండాభరనాలనే ఇచ్చి) (ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ) కాయా కష్టం చెయనీకుండా డబ్బిస్తుంటే ఏం చేస్తాం నచ్చే చీరే చూపిస్తుంటే కట్టేయకుండా ఏం చేస్తాం ఏరా electionకి బయలుదేరావా లేదు నానా చదువుకోవాలి అబ్బో కలెక్టర్ అయ్యావ్లే కానీ బయలుదేరు ఓటుకి ఐదేలంట ఐదేలా ఐదేలే అయితే వచ్చేత్నాను నానోయ్ చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే డబ్బే చేసిందే మాయే ఊరంతా గొర్రెలాయే (చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే) (డబ్బే చేసిందే మాయే) (ఊరంతా గొర్రెలాయే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) అసలేం కావాలండి మన ఊరోళ్లకి నేన్ చెప్తాను ఉండు మంచీ జరగాలి ఊరు మారాలి School-u కావాలి job-uలు రావాలి జాతకాలు మారిపోవాలి అయ్యబాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి ఏదేమైనా కాని Vote మాత్రం అమ్ముకు దొబ్బాలి రా అంటే చివరాకరికి ఏమంటారండి ఇప్పుడు డబ్బిచ్చేంటోళ్లని మింగా ఓటమ్మేటోళ్లని మింగా ఐదేళ్లకు అమ్ముడు పోయే గొర్రే మందల్ని మింగా (డబ్బిచ్చేంటోళ్లని మింగా) (ఓటమ్మేటోళ్లని మింగా) (ఐదేళ్లకు అమ్ముడు పోయే) (గొర్రే మందల్ని మింగా) (డబ్బిచ్చేంటోళ్లని మింగా) (ఓటమ్మేటోళ్లని మింగా) (ఐదేళ్లకు అమ్ముడు పోయే) (గొర్రే మందల్ని మింగా) నానా మింగడమంటే ఏంటి నానా ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లమ్ముకొనే వాళ్లందరినీ నమిలి మింగేయాలనమాట Hello hello ల ల్లో Ok నానా (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (స్వాగో స్వాగు) (స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)

Committee Kurrollu : Oo Baatasari Song Lyrics (ఓ బాటసారి ఏంటో నీ దారి)

చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)

సంగీతం: అనుదీప్ దేవ్

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: P.V.N.S రోహిత్



పల్లవి:

ఓ బాటసారి ఏంటో నీ దారి నీతో నువ్వు ఉంటె చాలు అంటవె ఏకాంతంమంతా నీ సొంతమంటూ మౌనలు వీడి రానంటావే గతాలు గాయాలు చేదయినా నిజాలె బాధైన సరెలే దాటి కాలంతో కొనసాగాలె కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి

చరణం 1:

జీవితాన అసలైన దూరం రెండు గుండెలకు మధ్య దూరం ఏ మంచికో నీ కంచెలు ఎంత వారికైనా పెద్ద భారం పంచుకోక తోడులేని భారం నీ చేతలే తలరాతలు సర్దుకోవలె దిద్దుకొవలె నిన్నటి తప్పేది నీదైన అందుకో రమ్మంటూ నువ్వు చెయ్యందిస్తే లోకమే కత్తులు దూసేనా ఎంత లేసి విశ్వ గోళమయిన కవుగికంత చిన్నది అంట గిరిగీతలే చెరిపేసుకో సాయమైన సాటివారికన్న బంధువులు ఆప్తులు ఎవరు అంట నన్ను చూపును సరిచేసుకో అందరూ నీవలె నీలాంటి వల్లె ఎవరివైనా కన్నిలె నూరేళ్లు కొన్నాళ్ళే ఓ రోజు పోవాలె అందక ప్రేమను పంచాలే కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి

Committee Kurrollu : Prema Gaaradi Song Lyrics (ఇదేమి గారడీ)

చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)

సంగీతం: అనుదీప్ దేవ్

రచన: కిట్టు విస్సాప్రగడ

గానం: అర్మాన్ మాలిక్



పల్లవి:

సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటా కోల కళ్ళ సింగారాలు అమ్మాయివంటా తిప్పుకుంట ఈదుల్లోన సాగే పిల్లంటా పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంటా… అరెరె కుర్ర ఈడే మళ్ళీ మళ్ళీ రానే రాదే ఇప్పుడే సెయ్యాలంటా సిన్ని అల్లర్లే ఎవరో సూత్తావున్న కంగారంటు లేనే లేదే మనసే హడావిడి చేసే నేడే ఇది వయసుకి కితకితలేగా… ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ ఈ సిన్ని గుండెల్లో తూఫాను మాదిరి. రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే

చరణం 1:

వయ్యారమో, బంగారమో అమ్మాయి ఆ నవ్వుల్లోన దాచి పెట్టుకుందే ఈలే ఏసి, గోలే చేసి కళ్ళే తిప్పి చూడంగానే గుండె జారిపోయే అందరికీ కులికే తెగ కులికే మగువల వెనకాలే పడుతూ లేస్తూ పరుగే పెడుతున్నానే పలికే పెదవులపై చిరునవ్వే పూస్తే ఎదలో గొడవే మొదలైపోయే ఇది తెలియని పరవశమేగా ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ ఈ సిన్ని గుండెల్లో… తూఫాను మాదిరి తూఫాను మాదిరీ…

చరణం 2: కోరి కోరీ చెంతే చెరీ సిగ్గే పడి మళ్ళీ కొంచెం దూరం జరుగుతుంటే, జంటే కట్టి, దారే పట్టి చెట్టాపట్టాలెయ్యాలంటూ గుండె కోరుతున్న తొందరికీ తెలిసీ తెలియకనే మొదలయ్యే స్నేహం చినుకై తగిలి చిగురైపోయే మాయే మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం సరదా పడితే పెరిగే హాయే. ఇది వయసుకి కితకితలేగా… ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ ఈ సిన్ని గుండెల్లో… తూఫాను మాదిరి తూఫాను మాదిరీ…

Committee Kurrollu : Aa Rojulu Malli Raavu Song Lyrics (ఆ రోజులు మళ్ళి రావు)

చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)

సంగీతం: అనుదీప్ దేవ్

రచన: కృష్ణకాంత్

గానం: కార్తీక్



పల్లవి:

రాదే రాదే అలుపంటు రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంటా వయసే ఇపుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదాచోటే అరెరే బాల్యం రమ్మన్న రాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుటుందే.. స్నేహాలే.. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు

చరణం 1:

సొంత ఊరిలో కన్న వారితో ఉంటే వేరేలే మనసంతా హాయేలే అంతా మారిన సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నా లోనే దాస్తం మా ప్రేమ బైటే పెట్టే ధైర్యాలే లేవు లే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవ్వర్నైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆ దారే ఆ నాటి మాయే ఏమాయే దేవుడు కనిపించి ఏం కావాలి అంటే మళ్ళి వెళ్తాం మేమంతా చిన్న నాటికే ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళి రావు ఈరోజుల్లా కానే కావు అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు