చిత్రం: కమిటీ కుర్రోళ్లు (2024)
సంగీతం: అనుదీప్ దేవ్
రచన: నాగ్ అర్జున్ రెడ్డి
గానం: అనుదీప్ దేవ్ , వినాయక్ , అఖిల్ చంద్ర , హర్షవర్ధన్ చావలి , ఆదిత్య భీమతాటి , సింధుజా శ్రీనివాసన్ , మనీషా పాండ్రంకి, అర్జున్ విజయ్
నానా బండి తియ్ బాబోయ్ తాగున్నా బండి తీగూడదు మందు తాగి బండే కాదు నానా Vote-u కూడా వెయ్యకూడదు మందుందా ఓయ్ electionలో ఎవడురా నీకు మందు పంచి పెట్టేది అదేంటి అక్కడ A1 గాడు పంచుతున్నాడు కదా మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తుంటారే (మందిస్తే చాలంటారే మంచక్కరలేదంటారే) (ఎవడొస్తే మాకేంటంటూ ఎర్రోలై బతికేస్తారే) రోడ్లన్నీ గతుకుల పాలే ఊరంతా చీకటి పాలే Rationలు పించనులన్నీ మొత్తానికి గల్లంతాయే (రోడ్లన్నీ గతుకుల పాలే) (ఊరంతా చీకటి పాలే) (Rationలు పించనులన్నీ) (మొత్తానికి గల్లంతాయే) ఎన్నున్నాయి ఓట్లు నాలుగండి అరే నాలుగంట్రా ఏమోవ్ ఈయన దగ్గర చీరలు కుంకుంబరినాలు తీసుకొని ఓటెయడం కంటే గుడి మెట్ల మీద అడుక్కోవడం చానా మేలు స్వాగో స్వాగు స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు హేయ్ పట్టు చీరల్నే పంచి వెండాభరనాలనే ఇచ్చి ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ (పట్టు చీరల్నే పంచి) (వెండాభరనాలనే ఇచ్చి) (ఏమారుస్తారే ఆళ్లకు కావాల్సిందల్లా కుర్చీ) కాయా కష్టం చెయనీకుండా డబ్బిస్తుంటే ఏం చేస్తాం నచ్చే చీరే చూపిస్తుంటే కట్టేయకుండా ఏం చేస్తాం ఏరా electionకి బయలుదేరావా లేదు నానా చదువుకోవాలి అబ్బో కలెక్టర్ అయ్యావ్లే కానీ బయలుదేరు ఓటుకి ఐదేలంట ఐదేలా ఐదేలే అయితే వచ్చేత్నాను నానోయ్ చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే డబ్బే చేసిందే మాయే ఊరంతా గొర్రెలాయే (చదువే సల్లారిపాయే బతుకే తెల్లారిపాయే) (డబ్బే చేసిందే మాయే) (ఊరంతా గొర్రెలాయే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) అసలేం కావాలండి మన ఊరోళ్లకి నేన్ చెప్తాను ఉండు మంచీ జరగాలి ఊరు మారాలి School-u కావాలి job-uలు రావాలి జాతకాలు మారిపోవాలి అయ్యబాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి ఏదేమైనా కాని Vote మాత్రం అమ్ముకు దొబ్బాలి రా అంటే చివరాకరికి ఏమంటారండి ఇప్పుడు డబ్బిచ్చేంటోళ్లని మింగా ఓటమ్మేటోళ్లని మింగా ఐదేళ్లకు అమ్ముడు పోయే గొర్రే మందల్ని మింగా (డబ్బిచ్చేంటోళ్లని మింగా) (ఓటమ్మేటోళ్లని మింగా) (ఐదేళ్లకు అమ్ముడు పోయే) (గొర్రే మందల్ని మింగా) (డబ్బిచ్చేంటోళ్లని మింగా) (ఓటమ్మేటోళ్లని మింగా) (ఐదేళ్లకు అమ్ముడు పోయే) (గొర్రే మందల్ని మింగా) నానా మింగడమంటే ఏంటి నానా ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓట్లమ్ముకొనే వాళ్లందరినీ నమిలి మింగేయాలనమాట Hello hello ల ల్లో Ok నానా (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (స్వాగో స్వాగు) (స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగ్ స్వాగు) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే) (దరువేత్తా రారేరారే దరువేత్తా రారేరారే)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి