18, అక్టోబర్ 2024, శుక్రవారం

Maruthi Nagar Subramanyam : Madam Sir Madam Anthe Song Lyrics (మేడం సారు మేడమంతే…)

చిత్రం: మారుతీ నగర్ సుబ్రమణ్యం (2024)

సంగీతం: కళ్యాణ్ నాయక్

రచన: భాస్కర భట్ల

గానం: సిద్ శ్రీరామ్



పల్లవి:

హే, తొలి తొలిసారి తొలిసారి గుండె గంతులేస్తున్నదే ఏంటీ అల్లరి అంటే వినకుందే ఎందుకనో నువ్ నచ్చేసి వెంట వెంటపడుతున్నదే నన్ను తోడు రమ్మని పిలిచిందే నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుచేత ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోత ఏదో మాయ చేసావ్ కధే నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెళ్ళిపోతా నక్సలైటులాగ నీకు నేను లొంగిపోత ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదే… తనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే తలొంచి మొక్కిన తప్పే కాదే. మేడం సారు మేడమంతే… ప్రపంచవింతలు ఎన్నని అంటే నేనొప్పుకోనే ఏడని అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే మేడం సారు మేడమంతే…

చరణం 1: ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే మనసే అడుగుతోంది దాని బాధ కొంచం చూడవే ఇకపైనుంచి నిద్దర రానే రాదులే కంటిపాపతోని తప్పవేమో యుద్ధాలే ఇదేంటిలా ఇదేంటిలా నాలో ఇన్ని చిత్రాలు పడేసావే కొమాలాంటి చితిలో, ఓ ఓ వచ్చాయేమో వచ్చాయేమో పాదాలకు చక్రాలు ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ ఓ కుర్ర ఈడునేమో కోసినావు ఊచకోత బంధిపోటులాగా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోతా కల్లోలాన్ని తెచ్చావ్ కదే చెయ్యి పట్టుకుంటే ఎంతలాగ పొంగిపోతా మాట ఇచ్చుకుంటె సచ్చెదాక ఉండిపోతా ఎలాగ ఎలాగ ఎలాగ ఎలాగ నమ్మకపోతే తనందమెంతటి గొప్పది అంటే తలెత్తి చూడక తప్పదు అంతే తలొంచి మొక్కిన తప్పే కాదే. మేడం సారు మేడమంతే… ప్రపంచవింతలు ఎన్నని అంటే నేనొప్పుకొనే ఏడని అంటే ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే మేడం సారు మేడమంతే… మ గ రి సా తా రా రా రా….. మేడం సారు మేడమంతే…

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి