18, అక్టోబర్ 2024, శుక్రవారం

Marana Mrudangam : Godave Godavamma Song Lyrics (గొడవే గొడవమ్మ...)

చిత్రం: మరణ మృదంగం (1988)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పల్లవి:

గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ... గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ... అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే... తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే... తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ చరణం 1: మొదటే చలి గాలి సలహాలు వింటే ముసిరే మోహాలు దాహాలు పెంచే కసిగా నీ చూపు నా దుంప తెంచే అసలే నీ వంపు నా కొంప ముంచే ముదిరే వలుపులో నిదురే సేవంట కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా బెదిరే కళ్ళలో కధలే నే వింటా అదిరే గుండెలో శృతులే ముద్దంటా దోబోచులాడేటి అందమొకటి ఉంది దోచేసుకోలేని బంధమొకటి అంది పదుకో రగిలే పరువం సిగలో విరిసే మరువం పగలే పెరిగే బిడియం కలిపి చెరిగే ప్రణయం గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ... గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ.. అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే తడిసి మెడిసి మెరిసే సొగసుఉలికి పడుతు గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ చరణం 2: ఇప్పుడే తెలిసింది ఈ ప్రేమ ఘాటు పడితే తెలిసింది తొలిప్రేమ కాటు కునుకే లేకున్నా ఈ నైట్ బీటు ఎప్పుడో మార్చింది నా హార్ట్ బీటు పిలిచే వయస్సులతో జరిగే పేరంటం మొలిచే సొగసులతో పెరిగే ఆరాటం చలికే వొళ్ళంతా పలికే సంగీతం సరదా పొద్దులోకరిగే సాయంత్రం నీ ఎడారి నిండా ఉదక మండలాలు నీటి ధార దాటే మౌన పంజరాలు తనువే తగిలే హృదయం కనులై విరిసే ఉదయం జతగా దొరికే సమయం ఒకటైపోయే ఉభయం గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ... గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ.. అడుగు అడిగేది అడుగు వయసే మిడిసి పడుతుంటే తళుకే సుడులే తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే తడిసి మెడిసి మెరిసే సొగసు ఉలికి పడుతు గొడవే గోడవమ్మ చేయి పట్టే చిలిపి వాడమ్మ గొడవే లేదమ్మా దారి పట్టి పోదకే పదవమ్మ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి