చిత్రం: స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం:ఇళయరాజా
పల్లవి:
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా పడింది ముద్దరా చెడింది నిద్దర వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె కథేమిటే చెలీ ఇదేమి కౌగిలి గులాబి మొగ్గలో గులేబకావళి ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
చరణం 1:
పిచ్చి ఎక్కి గాలి గిచ్చి చంపుతుంటే
ఎక్కడో చిక్కడే సిగ్గు పాప
గుచ్చి గుచ్చి చూసే కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
వయ్యారి ఒంటికీ ఒత్తిడంత ఇష్టమా
ఆ కంటి చాటుకే రాలేవా
శృంగార లీలకీ చీకటెంత ఇష్టమా
ఆ పొద్దు వాలితే వారేవ్వా
అందాల ఆరడి అయ్యాక నే ready
అందాక తాకిడి ఆపైన దోపిడి
పాదాలు నేను దాచుకుంటా
ప్రాయాలు నేను దోచుకుంటా
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా...
చరణం 2:
ముక్కు మీద కోపం ముట్టుకోని రూపం ఇక్కడే ఇప్పుడే అంటుకోనా పక్కదిండు పాపం చుట్టాలమ్మ సాక్ష్యం వద్దనీ వాయిదా వేసుకోనా అమ్మాయి తీగరో…సన్నాయి నొక్కుతో సంగీత నవ్వులే రావాలి అబ్బాయి రాకతో లల్లాయి పాటలో గారాల ఎంకినై పోవాలి శ్రీకాముడీ గుడి సిందూర పాపిడి పట్టిందిలే రతి ప్రాయాల హారతి గుప్పిళ్ళు విప్పుకోని పాప చప్పుల్లు చాలుగాని టాటా కథేమిటే చెలీ ఇదేమి కౌగిలి గులాబి మొగ్గలో గులేబకావళి వయస్సు ఒడ్డు దాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయె ఫలాన చోట అంటుకోనా ఫలాల పంట అందుకోనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి