చిత్రం: స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991)
రచన: వేటూరి
గానం: మనో, ఎస్.జానకి
సంగీతం:ఇళయరాజా
పల్లవి:
చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని షోకు నాకు సంబరం మొదలై ...తొలి శకం తగిలే ...సతి సుఖం ప్రియ కన్యాలాభం కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి ఈ దినం మొదలై ....చలియుగం కలిసే చెరిసగం ఇది జాలీ లవ్ గేమ్ .... చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని షోకు నాకు సంబరం
చరణం 1:
నరాల వీణ మీటితే స్వరాలు లేని పాటలు సరాగమాడు సందెలో పరాగమాడు తోటలు పదాలు ఒక్కటై ఇలా బిగించుకున్న జంటలు వరించుకున్న దిక్కునే ధ్వనించు ప్రేమ గంటలు ఏమి తీపి ఆకలో ఎంత వింత సాధలో ... రాయలేని భావమో మోయలేని మోహమో .... తోడు లేక తోచదాయేలే ...ఎందుకో ... చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని షోకు నాకు సంబరం మొదలై ....చలియుగం కలిసే చెరిసగం ఇది జాలీ లవ్ గేమ్ .... చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీర దాచలేని షోకు నాకు సంబరం
చరణం 2:
వసంత రాగ వీధిలో విశాల కోకిలమ్మలు విశాఖ వేళా ఎండలో రచించు మల్లె రెమ్మలు షిఫాను కొంగు గాలితో తుఫాను రేపు భామలు పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు ఊహాలోని ఉత్సవం వాటమైన వాస్తవం సందెవేళ సంభవం అందమైన సంగమం నిన్ను తాకి నీడలాయెనే అందుకే కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం ఆహా రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి ఈ దినం మొదలై ...తొలి శకం హా తగిలే ...సతి సుఖం ప్రియ కన్యాలాభం కాలమంత కత్తిరిస్తే కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తెరేస్తే రేయి ఈ దినం