1, నవంబర్ 2024, శుక్రవారం

Jajimalli : Ekkadapadithe Song Lyrics (ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే )

చిత్రం: జాజిమల్లి (2002)

రచన: పైడిశెట్టి

గానం: మల్లికార్జున

సంగీతం: భేరి ఉమామహేష్



పల్లవి :

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే కంటికి ఎదురుగా ఎవరున్నా నీరూపాన్నే చూస్తున్నా ఒంటిగా ఎక్కడ నిల్చున్న నీ తలపుల్లో నే ఉన్న వలపులు వలదని మనసే అంటున్న కన్ను నిన్నే నిన్నే లే చూడాలంటుందే నిన్ను నాలో నాలో నే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే

చరణం 1 : 

పుస్తకాలు చదివానే ప్రేమ చరితలు లెన్నో విన్నానే ప్రేమ జంటలను కలిసానే ఈ ప్రేమ మహిమలేంటో అడిగానే ప్రేమంటే సముద్రం మన్నారొకరు ప్రేమంటే అమృత మన్నారింకొకరు ఆ లోతుకు దూకాలని పించే ఈ తీపిని చూడాలనిపించే ముప్పులు తప్పక తప్పవని తెలిసే కన్ను నిన్నే నిన్నే లే చూడాలంటుందే నిన్ను నాలో నాలో నే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే

చరణం 2 :  అనుభవజ్ఞులను కలిసానే నా గుండె బాధనంతా చెప్పానే సైకాలజిస్టుల ను కలిసానే ఉత్తరాలు కూడా రాసానే నీ మనసుకు మార్గం ధ్యానం అన్నారొకరు నీ వయసుకు భారం తప్పదు అన్నారింకొకరు అను నిత్యం ధ్యానం చేస్తున్న యద మోయని భారం మోస్తున్న తిప్పలు తప్పక తప్పవని తెలిసి కన్ను నిన్నే నిన్నే లే చూడాలంటుందే నిన్ను నాలో నాలో నే దాచాలంటుందే ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూ ఉందే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి