23, డిసెంబర్ 2024, సోమవారం

Aarya-2 : Karige Loga Song Lyrics (కరిగేలోగా ఈ క్షణం)

చిత్రం: ఆర్య-2(2009)

రచన: వనమాలి

గానం: కునాల్ గంజవాలా & మేఘా

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ...

చరణం: 1 :

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ నేడీ బంధానికి పేరుందా ఓ ఉంటే విడదీసే వీలుందా ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే... హే

చరణం: 2 :

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరునిముషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై వాడని నవ్వుల పువ్వే నువు పెంచావా నీ కన్నీటిని చల్లి సాగే మీ జంటని చూస్తుంటే ఓ నా బాధంతటి అందంగా ఉందే ఓ ఈ క్షణమే నూరేళ్ళౌతానంటే ఓ మరుజన్మే క్షణమైనా చాలంతే ఓ కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ...

కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ... ఓ... ఓ... ఓ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి