29, డిసెంబర్ 2024, ఆదివారం

ARM : Ambaraala Veedhilo Song Lyrics (అంబరాల వీధిలో )

చిత్రం: ARM  (2024)

రచన:  కృష్ణ కాంత్

గానం: సిందూరి విశాల్

సంగీతం: ధిబు నినాన్ థామస్ 


పల్లవి :-

అంబరాల వీధిలో చిన్ని చందమామా రా,
అందున ఓదిగుంది రా,
చెవుల పిల్లిరా.
నీడ నీలి దీవిలో,
నీటి మీద మెరిసేర,
ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా.
ఆ అమ్మాయి తాబేలుకు తంబులా,
పెట్టిక కట్టుంది రా,
తాపిగా ఇదుకుంటు ఆ నీళ్లలో,ఏముకుందిరా .
తారలంటి ఆకారం తాలమే,
దానికీ వేసుందిరా,
లెక్కనె పెట్టలేని ఒక్కలే,
అందులో ఉన్నాయిరా.
బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా,
వినుకోరా నువ్వే బజ్జో,లాలిజో లాలి జో
నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు,
ఎదుగింకా ఎదుగు ఎదుగు హ్మ్మ్…,

లాలి జో లాలి జో హ్మ్మ్…. ...హు... చరణం :-1 నీ సుదూర దారిలో ఆగకుండ సాగిపో... చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ... ఎదురు నీకు లేదులే,అడ్డు నీకు రాదులే, ధారినిచ్చి జరుగులే నీటి అలలివే. నిశ్చింతగానే ఉండు, గాలులే నొప్పిని తీర్చవా, ఆకాశ నక్షత్రాలే, దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా. నీ ముద్దు అగ్గి పుట్టే చీకట్లే, పారద్రోళ కదిలే, నువ్వొకే విత్తు వేస్తే ఈ మన్ను, అడవల్లే మార్చేవాడా బుజ్జాయ్ రారా కథ చెబుతా కన్నా, వినుకోరా నువ్వే బజ్జోలాలి జో లాలి జో నానా సరదాగా ఆడు మురిపెంగా ఆలు, ఎదుగింకా ఎదుగు ఎదుగు. నిలవారా నిలవారా, కలుగునా కానారా, నిలవారా నిలవారా, జనము నువ్వే గెలవారా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి