చిత్రం: మిస్టర్ పెళ్ళాం (1993)
రచన: వేటూరి సుందర రామ మూర్తి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ నీ సొగసు చూడ తరమా ఆ ఆ (2) నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ.. చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ ... పెట్టి పెట్టని ముద్దును ఇట్టే విదిలి౦చికొట్టి గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టె తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు విడువిడుమ౦టున్నపుడు ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడతరమా ఆ.. ఆ.. పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు, పెదపాపడు పాకివచ్హి, మరి నాకో అన్నపుడు మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లైవెలసినపుడు ఆ సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా ఆ ఆ సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి, క్షణమే..యుగమై వేచి వేచి చలిపొ౦గును చెలికోకలముడిలొ అదిమి అలిసీ సొలసీ కన్నులువాచీ నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో.. త్యాగరాజ కృతిలో సీతాకృతి కలిగిన ఇటువ౦టి సొగసుచూడతరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి