చిత్రం: గోవింద గోవింద (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర
సంగీతం: రాజ్-కోటి
పల్లవి:
అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా అందమా అందుమా అందనంటే అందమా
చరణం 1:
ఆకలుండదే దాహముండదె ఆకతాయి కోరిక
కొరుక్కు తింటాదే
ఆగనంటదే దాగానంటదే ఆకు చాటు వేడుక
కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్ననమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరాన చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
చరణం 2:
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టాడే ఎలా ఇదేమి విల విలా తియ్య తియ్యగా నచ్చ చెప్పని చిచ్చి కొట్టని ఇలా వయ్యారి వెన్నెల నిలవనీదు నిదరపోదు నారాయణ వగలమారి వయసు పోరు నా వల్లనా చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించానా ఆదుకో నాయనా ఆర్చావా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి