చిత్రం: కర్తవ్యం (1990)
సాహిత్యం: వేటూరి సుందర రామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: రాజ్ - కోటి
పల్లవి :
సమరం సమరం పొంగే రుధిరం
కృషికే విజయం కాదు శిథిలం
నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం
ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం
నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం
నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం
సమరం సమరం పొంగే రుధిరం
కృషికే విజయం కాదు శిథిలం
చరణం 1 :
పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా
పెట్టుకున్నగురి ధృవతార ఆకశానికది పొలిమేరా
జరిగే జీవనవ్యాయామంలో మరిగేకన్నుల భాష్పజలంలో
రక్తం పొంగే నీగాయం అరుణవిప్లవాక్షరగేయం
సమరం సమరం పొంగే రుధిరం
కృషికే విజయం కాదు శిథిలం
చరణం 2:
నిరాశవద్దు నిస్పృహవద్దు నిశ్చేతనమే కావద్దు
కర్మయోగికి కాళరాత్రులలో భయమేలేదు లేదు
సహకరించని అంగాంగాలను సమిధలుగా ఇక ప్రేల్చు
అగ్నిహోత్రివై యజ్ఞహోతవై యజ్ఞకర్తవై యజ్ఞభోక్తవై
నీచకీచకపు కామమేచకపు భ్రష్టులనే ఇలరల్చు
రాక్షసాధనుల రాక్షసత్వముల పాలననే పరిమార్చు
సమరం సమరం పొంగే రుధిరం
కృషికే విజయం కాదు శిథిలం
ఆశయానికిది ఆరంభం ఆత్మసాధనకు అధ్యాయం
నీ ఊరుకు సాగిన తూరుపులో, వెలగనున్నదీ ఒక ఉదయం
నిన్నటి చీకటి నిట్టూరుపులో నివురైపోయెనులే విలయం
సమరం సమరం పొంగే రుధిరం
కృషికే విజయం కాదు శిథిలం
నీకర్తవ్యం నీకర్తవ్యం నీకర్తవ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి