చిత్రం: మనీ(1993)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: శ్రీ మూర్తి
గానం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సత్యం, శ్రీనివాస మూర్తి
వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..
వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డ్యాన్సు...
చెప్పింది చెయ్యరా, నీవెరా ముందు డేసు..
వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు
అమితాబచ్చను కన్నా ఎం తక్కువ నువ్వైన..
హాలివుడ్లో ఐనా ఎవరెక్కువ నీకన్నా..
ఫైటూ, ఫీటు, ఆట, పాట రావా నీకైనా..
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టారైపొలేదయ్యా,
తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా..
బాలయ్యా, వెంకటేషు, నాగార్జునా, నరేషు,
రాజేంద్రుడు, సురేషు, రాజశేఖరు అదర్సు
మొత్తంగా అందరూ అయి పొవాలోయ్ మటాషూ.
వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు
గూండా, రౌడీ, దాదా అంటారే బైటుంటే..
ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జైకొడతారు తేడా మేకప్పే..
నువ్వుంటే చాల్లే అంటారు, కథెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు ఛస్తారు
బావుంది గాని ప్లాను, పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారీ బాత్ మాను, జర దారు తగ్గించు ఖాను..
అరె ఛీ పో.. శకున పక్షిలా తగులుకోకు ముందు
వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి