Money లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Money లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2025, బుధవారం

Money : Bhadram Be Careful Song Lyrics (భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు)

 చిత్రం: మనీ(1993)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: శ్రీ మూర్తి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగా మారకు బ్యాచీలరు

షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగా మారకు బ్యాచీలరు

షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు


చరణం:1

ఆలీకి మెళ్ళో ముళ్ళేసానని ఆనందించే మగవారూ

ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారూ

మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్ ఉ

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగా మారకు బ్యాచీలరు

షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు


చరణం:2

వంటకనీ వైఫ్ ఎందుకురా హోటళ్లే చాలూ

ఒంటికనీ ఒకటా రెండా అంగడి అందాలూ

కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం

జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం

ఎందుకు మనకీ గ్రహచారం అందుకనే

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగా మారకు బ్యాచీలరు

షాదీ మాటే వద్దే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు


చరణం:3

పులి లగే పెళ్ళికి కూడా లెటర్సు రెండే రా

పరవాలేదని పక్కకు వెళ్తే పాలరమైపోరా

ఇడి అమిన్ యూ సాధంహుస్సాను

హిట్లర్ ఎక్స ఎట్రా

ఇంట్లో ఉన్న పెళ్ళాం కన్నా

డిక్టేటర్ల ట్ర అంతటి డిక్టేటర్ల ట్ర

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు

భర్తగా మారకు బ్యాచీలరు

షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరు

28, డిసెంబర్ 2024, శనివారం

Money : Vaah re vaah yemi fesu song lyrics (వారేవా ఏమి ఫేసు)

 చిత్రం: మనీ(1993)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: శ్రీ మూర్తి

గానం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సత్యం, శ్రీనివాస మూర్తి



వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..


వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..

పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డ్యాన్సు...

చెప్పింది చెయ్యరా, నీవెరా ముందు డేసు..

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు


అమితాబచ్చను కన్నా ఎం తక్కువ నువ్వైన.. 

హాలివుడ్లో ఐనా ఎవరెక్కువ నీకన్నా..

ఫైటూ, ఫీటు, ఆట, పాట రావా నీకైనా..

చిరంజీవైనా పుడుతూనే మెగాస్టారైపొలేదయ్యా, 

తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా..

బాలయ్యా, వెంకటేషు, నాగార్జునా, నరేషు, 

రాజేంద్రుడు, సురేషు, రాజశేఖరు అదర్సు 

మొత్తంగా అందరూ అయి పొవాలోయ్ మటాషూ. 

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు


గూండా, రౌడీ, దాదా అంటారే బైటుంటే.. 

ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే 

ఓహో అంటూ జైకొడతారు తేడా మేకప్పే.. 

నువ్వుంటే చాల్లే అంటారు, కథెందుకు పోన్లే అంటారు 

కటౌట్లూ గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు ఛస్తారు  

బావుంది గాని ప్లాను, పల్టీ కొట్టిందో ఏమి గాను 

బేకారీ బాత్ మాను, జర దారు తగ్గించు ఖాను.. 

అరె ఛీ పో.. శకున పక్షిలా తగులుకోకు ముందు 

వారేవా ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు

వచ్చింది సినిమా ఛాన్సు.. ఇంక వేసేయి మరో డోసు..

4, జూన్ 2021, శుక్రవారం

Money : Chakravarthiki Bichagatteki song lyrics (చక్రవర్తి కీ వీధి బిచ్చగత్తెకీ )

చిత్రం: మనీ(1993)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: శ్రీ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



(పల్లవి):-

చక్రవర్తి కీ వీధి బిచ్చగత్తెకీ బందువౌతాననీ 
అంది మనీ మనీ....
అమ్మ చుట్టమూ కాదూ. అయ్య చుట్టమూ కాదు..
అయినా అన్నీ అంది మనీ మనీ...
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు.
పెట్టుకుంటుందని అంది మనీ మనీ...
పుట్టడానికీ.పాడె కట్టడానికీ మధ్య అంతా. 
తనే అంది మనీ మనీ...
కాలం ఖరీదు చేద్దాం.పదండి అంది మనీ మనీ...
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ..
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా...
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా ....
చక్రవర్తి కీ వీధి బిచ్చగత్తెకీ బందువౌతాననీ 
అంది మనీ మనీ....
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు.
అయినా అన్నీ అంది మనీ మనీ....


(చరణం.1):-

ఇంటద్దే కట్టావా. నా తండ్రి..
నో ఎంట్రీ వీధి వాకిట్లో...
దొంగల్లే దూరాలి సైలెంట్లీ..
నీ ఇంట్లో చిమ్మ చీకట్లో...
అందుకే పదా బ్రదర్ బ్రదర్ వేటకీ..
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకి...
రోటీ కపడా.రూము అన్నీ రూపీ రూపాలే..
సొమ్ముని శరణమ్మని.చరణమ్ము నమ్ముకోరా..
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా ....
చక్రవర్తి కీి వీధి బిచ్చగత్తే కీ బందువౌతాననీ 
అంది మనీ మనీ....
అమ్మ చుట్టమూ కాదు.అయ్య చుట్టమూ కాదు..
అయినా అన్నీ అంది మనీ మనీ....


(చరణం.2):-

ప్రేమించుకోవచ్చు దర్జాగా.పిక్చర్లో పేద హీరో లా...
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామా లో ప్రేమ స్టోరీ లా...
పార్కులో కనే కలే ఖరీదైనది..
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ...
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ..
జీవితం ప్రతి నిమిషమూ..
సొమ్మిచ్చి పుచ్చుకోరా...
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా ....


చక్రవర్తి కీ వీధి బిచ్చగత్తే కీ బందువౌతాననీ 
అంది మనీ మనీ....
అమ్మ చుట్టమూ కాదు.అయ్య చుట్టమూ కాదు.
అయినా అన్నీ అంది మనీ మనీ......
కాలం ఖరీదు చేద్దాం. పదండి అంది మనీ మనీ.....
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ.......
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా..
దీక్షగా ధనలక్ష్మి ని లవ్వాడి కట్టుకోరా...
డబ్బు రా డబ్బు డబ్బు రా..
డబ్బు డబ్బే డబ్బు డబ్బు రా....