14, డిసెంబర్ 2024, శనివారం

Muddula Mogudu : O Muddu Gumma Song Lyrics (ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ)

చిత్రం: ముద్దుల మొగుడు (1997)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: కోటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

M : ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా F : ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో M : చెంగు దాటగా చెమ్మ చెక్కలాట F : జోరుగుండదా జోడు గువ్వలాట M : పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా         ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా F : ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

చరణం 1:

M : కుర్రదాన కుశలమా కుతకొచ్చే పరువమా F : గుట్టుదాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా M : ఈడే కోడై ఈలేసినా జాబిల్లోస్తుందా F : జాబిళ్ళమ్మా కౌగిళ్ళలో జాగారిస్తుందా M : గడప దాటని అందం కడప చేరినదా F : మొదటిచూపుకు మొహం మొటిమ లేసినదా M : పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా         ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా F : ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో

చరణం 2:

F : దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు M : కస్సుమన్నా కదలవు కమ్ముకున్న వలపులు F : ముద్దింటమ్మ ఆకళ్లలో ముప్పూట జరిగే M : చేరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే F : తలుపు మూసిన తాపం తణుకు చేరినదా M : మధుర మన్మధ బాణం ఆధరమడిగినదా F,పాలపుంతలన్ని తోడు పాయసాలు జుర్రుకున్న గోపాలా M : ఓ ముద్దుగుమ్మా నీ ముద్దుగుమ్మమెక్కడుందొ చెప్పవమ్మా F : ఓరందగాడ నా ముద్దబంతి మొగ్గ నీకు చిక్కదయ్యో M : చెంగు దాటగా చెమ్మ చెక్కలాట F : జోరుగుండదా జోడు గువ్వలాట M : పాల ఈడు తోడుపెట్టి పచ్చిమీగడెక్కడంటే గోపాలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి