14, డిసెంబర్ 2024, శనివారం

Muddula Mogudu : Are Gili Gili Song Lyrics (అరె గిలి గిలి గిలి మంజారో పింజారో)

చిత్రం: ముద్దుల మొగుడు (1997)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: కోటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత



పల్లవి:

సాహో... అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల షేపురో అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే సాహో... అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హోయ్

చరణం 1:

కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి కప్పలు అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు యాహో... అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో హాయ్

చరణం 2:

వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు ఆఁ చెలి తోడు కోరింది గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు చలికాలం చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు యమహో... అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల షేపురో అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే సాహో...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి