చిత్రం: శుభ సంకల్పం (1995)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
మూడు ముళ్ళు వేసినాక
చాటులేదు మాటులెదు
గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాట..
ఆకుపచ్చ కొండల్లో.. ఓ... గోరువెచ్చ గుండెల్లో..
ఆకుపచ్చ కొండల్లో, గోరువెచ్చ గుండెల్లో..
ముక్కుపచ్చలారపెట్టి ముద్దులంట..
మూడు ముళ్ళు వేసినాక
చాటులేదు మాటులెదు
గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎ
న్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాట
చాటులేదు మాటులెదు
గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎన్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాట..
ఆకుపచ్చ కొండల్లో.. ఓ... గోరువెచ్చ గుండెల్లో..
ఆకుపచ్చ కొండల్లో, గోరువెచ్చ గుండెల్లో..
ముక్కుపచ్చలారపెట్టి ముద్దులంట..
మూడు ముళ్ళు వేసినాక
చాటులేదు మాటులెదు
గూటిబైటె గుట్టులాట
ఏడు అంగలేసినాక ఎ
న్నెలింట కాలుపెట్టి
పాడుకుంట ఎంకిపాట
చరణం:1
ఒయె పుష్యమాసమొచ్చింది భోగిమంట రేపింది
కొత్తవేడి పుట్టింది గుండెలోన ..
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద..
కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా..
మంచుదేవతొచ్చిందా.. మంచమెక్కి కూచుందా..
వణుకులమ్మ తిరణాళ్ళే ఓరినాయనో..
సీతమ్మోరి సిటికెనయేలు సిలకతొడిగితే సిగ్గుయెర్రనా..
కొత్తవేడి పుట్టింది గుండెలోన ..
రేగుమంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద..
కాచుకున్న ఈడునే దోచుకుంటె తుమ్మెదా..
మంచుదేవతొచ్చిందా.. మంచమెక్కి కూచుందా..
వణుకులమ్మ తిరణాళ్ళే ఓరినాయనో..
సీతమ్మోరి సిటికెనయేలు సిలకతొడిగితే సిగ్గుయెర్రనా..
రాములోరు ఆ సిలక కొరికితే.. సితమ్మోరి బుగ్గలెర్రన..
చాటులేదు మాటులెదు .......
గుట్టులాట ఏడు అంగలేసినాక
ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..
చాటులేదు మాటులెదు .......
గుట్టులాట ఏడు అంగలేసినాక
ఎన్నెలింట కాలుపెట్టి పాడుకుంట ఎంకిపాట..
చరణం:2
వయసు చేదు తెలిసింది.. మనసు పులుపు కోరింది
చింతచెట్టు వెదికింది చీకటింట..
కొత్తకోరికేమిటొ చెప్పుకోవె కోయిల..
ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయల
ముద్దువాన వెలిసింది.. పొద్దుపొడుపు తెలిసింది
వయసు వరస మారింది ఓరి మన్మధా..
మూడుముళ్ళ జతలోన.. ముగ్గూరైన ఇంటిలోనా..
జోరుకాస్త తగ్గనీర జో జో జో...
జోజో..జోజోజో...
జోజో..జోజోజో...
చింతచెట్టు వెదికింది చీకటింట..
కొత్తకోరికేమిటొ చెప్పుకోవె కోయిల..
ఉత్తమాటలెందుకు తెచ్చుకోర ఊయల
ముద్దువాన వెలిసింది.. పొద్దుపొడుపు తెలిసింది
వయసు వరస మారింది ఓరి మన్మధా..
మూడుముళ్ళ జతలోన.. ముగ్గూరైన ఇంటిలోనా..
జోరుకాస్త తగ్గనీర జో జో జో...
జోజో..జోజోజో...
జోజో..జోజోజో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి