చిత్రం: తుఫాన్ (2013)
రచన: చంద్రబోస్
గానం: శ్రీరామచంద్ర, షల్మిలి ఖోల్గాడే
సంగీతం: చిరంతన్ భట్ట్
పల్లవి: అతడు: ప్రేమించా నీ పేరునీ ప్రేమించా నీ తీరునీ ప్రేమించానే నిన్నే చేరే నా దారినీ..... ఆమె: ప్రేమించా నీ శ్వాసనీ ప్రేమించా నీ స్పర్శనీ ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసనీ అతడు: ప్రేమించా నీ చిలిపి కోపాన్నీ ప్రేమించా నీ చిన్ని లోపాన్నీ ప్రేమించా నువ్వున్న లోకాన్నీ .... ప్రేమిస్తూ జీవించానే చరణం-1: అతడు: నా గాలి నిండా నీ పలుకులే నా నేల నిండా నీ అడుగులే ఓఓఓ... నా నింగి నిండా నీ మెరుపులే నా జగతి నిండా నీ గురుతులే ఆమె: కోరింది చెలి దేహం నీ ముద్దులే ఉండలేనంది చలి కాలం మన మధ్యలో ఆనంద బంధాలలో అతడు: ప్రేమించా అనుకోని పేచీనీ ప్రేమించా ఆపైన రాజీనీ ప్రేమించా అటుపైన ఆ ప్రేమనీ..... ప్రేమిస్తూ జీవించానే I just love నీ చూపునీ I just love నిట్టూర్పునీ ప్రేమించానే మనకై వేచే మునిమాపునీ...... I just love నీ ఊహనీ ఓఓ ... I just love నీ ఉనికినీ ప్రేమించానే నీలా విరిసే ఉదయాలనీ ఓహోహో... ప్రేమించా ఈ మధుర బాధల్నీ ప్రేమించా ఈ మంచు మంటల్నీ ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ ప్రేమిస్తూ జీవించానే ప్రేమించా ఈ మధుర బాధల్నీ ప్రేమించా ఈ మంచు మంటల్నీ ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ ప్రేమిస్తూ జీవించానే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి