25, డిసెంబర్ 2024, బుధవారం

Chantabbai : Atlanti itlanti song lyrics (అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను)

చిత్రం:చంటబ్బాయి (1986)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి. శైలజ

సంగీతం: కె. చక్రవర్తి



పల్లవి :

అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ చరణం : 1

నార్వేలోని మ్యారిమణుల గుండెల దాగిన ఖైదీని చల్లపిల్లిలో పిల్లిపిల్లలా దొరికిపోయిన ఖైదీవా హాంకాంగులో కింగ్ కాంగ్ నే తలదన్నిన మగధీరుణ్ణీ బందరులోన బల్లిని చూసి బావురుమన్న మగధీరుడివా.. యా.. నా భాషకూ గ్రామర్ హ్యూమర్, నా ఫేసుకూ గ్లామర్ హ్యూమర్ ఇది ఎవరూ నమ్మని రూమర్, ఇక వెయ్యకు నాకీ హేమర్.. నే చార్లీ చాప్లిన్నీ.... అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ చరణం : 2

సిడ్నీ వెళ్ళి కిడ్నీ తీసి దానమిచ్చిన విజేతనూ వడ్లపూడి ఇడ్లీ పోటిలో ఓడిపోయిన విజేతవా మాస్కో డిస్కో ఒలింపిక్సులో కాస్కోమన్న రాజునీ .. మగమహారాజునీ మంగళగిరిలో మహిళామండలి అధ్యక్షతకే అర్హతవున్న మగువరాజువా.. మగమహారాజువా నా కంటికి రెప్పలు కామెడి, నా వొంటికి ఊపిరి కామెడి వనమంతా చెరిచెను తా చెడీ..డి డి డీ.. అది కోతికి చెందిన ట్రాజెడీ...డి డి డీ... నే చార్లీ చాప్లిన్నీ.... అట్లాంటి ఇట్లాంటి హీరోని నేను మరి ఎట్లాంటి ఎట్లాంటి హీరో తమరు స్విస్సు మిస్సునే సిటీబస్సులో కిస్సు చేసిన హీమాన్నీ ఫ్రాన్సు లాన్సులో ఫ్రీలాన్సుగా డాన్సుచేసిన మొనగాణ్ణి లాస్యానికీ డాల్ఫిన్నీ, హాస్యానికి చాప్లిన్నీ .. నే చార్లీ చాప్లిన్నీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి