18, జనవరి 2025, శనివారం

Aadavaallu Meeku Joharlu : Papi Kondala Venuka Song Lyrics ( పాపికొండల వెనుక.. )

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి : 

పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లీ ఉన్నాడనీ.. 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయేనే 
పాపి కొండల వెనుక పాపంటి మనసున్న 
జాబిల్లీ ఉన్నాడననీ.. 
చల్లని కబురొచ్చెనే.. నా జంకంతా విడిపోయెనే 

చరణం 1: 

చీకటి కడుపులో పుట్టాడనీ.. 
వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ.. 
చీకటి కడుపులో పుట్టాడనీ... 
వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ... 
మాయని మచ్చొకటి కలవాడని 
మగువుల పాలిటి పగవాడని 
మాయని మచ్చొకటి కలవాడని 
మగువుల పాలిటి పగవాడని
నిలకడే లేదని నిందలే వింటినీ.... 
విన్నది కల్లాయనే... తెలి వెన్నెల జల్లాయనే... 
పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లి ఉన్నాడనీ... 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే
 
చరణం 2 : 

గోదారి గోలనే వింటారు... 
గుండెలో చలవెవరు చూస్తారు... 
గోదారి గోలనే వింటారూ... 
గుండెలో చలవెవరు చూస్తారు... 
కోకిలకు కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే 
కోకిలకి కాకికి గూడొక్కటే 
తేడాలు తెలిపేది గొంతొక్కటే 
నమ్మితే దేవుడు రాతిలో ఉన్నాడు 
కాకుల లోకానికి... నువ్వు కోకిల కావాలిలే... 
పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లి ఉన్నాడనీ.. ఈ ఈ ఈ.... 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి