Aadavaallu Meeku Joharlu(1981) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aadavaallu Meeku Joharlu(1981) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Aadavaallu Meeku Joharlu : Aadavaallu Meeku Joharlu Song Lyrics (ఆడాళ్ళు.... మీకు జోహార్లు )

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి: 

ఆడాళ్ళు.... మీకు జోహార్లు 
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు 
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు 
ఆడాళ్ళు... మీకు జోహార్లు 
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు 
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు 
ఆడాళ్ళు.... మీకు జోహార్లు 

చరణం 1: 

ఒకరు దబ్బ పండు... ఒకరు పనస పండు 
ఒకరిది కనపడే చక్కదనం... ఒకరిది కానరాని తియ్యదనం 
ఒకరు దబ్బ పండు... ఒకరు పనస పండు 
ఒకరిది కనపడే చక్కదనం... ఒకరిది కానరాని తియ్యదనం 
ఇద్దరి మంచితనం... నాకు ఇస్తుంది ప్రాణం 
ఇది తలచుకుంటే... మతిపోతుంది ఈదినం 
ఆడాళ్ళు.... మీకు జోహార్లు 

చరణం 2: 

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు 
మగవాడిని నమ్మడం మనిషి చేయడం 
మనసు నిదర లేపడం మమత నింపడం 
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు 
మగవాడిని నమ్మడం మనిషి చేయడం 
మనసు నిదర లేపడం మమత నింపడం 
ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం 
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం 
ఇదే పనా మీకూ... ఇందుకే పుట్టారా 
ఆడాళ్ళు.... మీకు జోహార్లు 
ఓపిక.. ఒద్దిక.. మీ పేర్లు 
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు 
ఆడాళ్ళు.... హ హ హ హ...

Aadavaallu Meeku Joharlu : Papi Kondala Venuka Song Lyrics ( పాపికొండల వెనుక.. )

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి : 

పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లీ ఉన్నాడనీ.. 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయేనే 
పాపి కొండల వెనుక పాపంటి మనసున్న 
జాబిల్లీ ఉన్నాడననీ.. 
చల్లని కబురొచ్చెనే.. నా జంకంతా విడిపోయెనే 

చరణం 1: 

చీకటి కడుపులో పుట్టాడనీ.. 
వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ.. 
చీకటి కడుపులో పుట్టాడనీ... 
వెలుగొచ్చి చీకటినే  చంపాడనీ... 
మాయని మచ్చొకటి కలవాడని 
మగువుల పాలిటి పగవాడని 
మాయని మచ్చొకటి కలవాడని 
మగువుల పాలిటి పగవాడని
నిలకడే లేదని నిందలే వింటినీ.... 
విన్నది కల్లాయనే... తెలి వెన్నెల జల్లాయనే... 
పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లి ఉన్నాడనీ... 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే
 
చరణం 2 : 

గోదారి గోలనే వింటారు... 
గుండెలో చలవెవరు చూస్తారు... 
గోదారి గోలనే వింటారూ... 
గుండెలో చలవెవరు చూస్తారు... 
కోకిలకు కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే 
కోకిలకి కాకికి గూడొక్కటే 
తేడాలు తెలిపేది గొంతొక్కటే 
నమ్మితే దేవుడు రాతిలో ఉన్నాడు 
కాకుల లోకానికి... నువ్వు కోకిల కావాలిలే... 
పాపికొండల వెనుక.. పాపంటి మనసున్న 
జాబిల్లి ఉన్నాడనీ.. ఈ ఈ ఈ.... 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే 
చల్లని కబురొచ్చెనే... నా జంకంతా విడిపోయెనే..

Aadavaallu Meeku Joharlu : Moju Mudirindi Song Lyrics (మోజు ముదిరింది...)

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి:  

ఆహా హా.. ఆ.. ఆహహా...  ఆ హా..
లలల.. లలల్లలా  
మోజు ముదిరింది... రోజు కుదిరింది
మోజు ముదిరింది... రోజు కుదిరింది
రాజుకుంటూంది లోలోన.. 
అది ఈ రాత్రితోనే చల్లారునా 
మోజు ముదిరింది... రోజు కుదిరింది

చరణం : 1

నీ కోడె వయసుకే గుమ్మయినా
నే కూడబెట్టినది ఇస్తున్నా
నీ కోడె వయసుకే గుమ్మయినా
నే కూడబెట్టినది ఇస్తున్నా 
నన్నెవరేమీ అనుకున్నా... ఆడిపోసుకున్నా
నన్నెవరేమీ అనుకున్నా... ఆడిపోసుకున్నా
నా ఆశ తీర్చుకుంటున్నా... ఆ పైన ఏమైనా... 
మోజు ముదిరింది... రోజు కుదిరింది

చరణం : 2

నీ తొడమీద శిరసెట్టి పడుకుంటే చాలు
నీ కడగంటి చూపులలో కాలినా మేలు
నువ్వు తోడుంటే నేనుంటా నిండుగ నూరేళ్ళు
నీ మాటింటే ఎక్కడికో పోతవి ప్రాణాలు 
పాపాలు పుణ్యాలు ఎరుగను...
ఈ వయసుతో పోరు పడలేను
పాపాలు పుణ్యాలు ఎరుగను...
ఈ వయసుతో పోరు పడలేను
పున్నెమని అనుకుంటే నీకు చెందునంటా
ఇది పున్నెమని అనుకుంటే నీకు చెందునంటా 
పాపంగా జమకడితే... నేను మోసుకెళ్తా 
మోజు ముదిరింది... రోజు కుదిరింది
మోజు ముదిరింది... రోజు కుదిరింది
రాజుకుంటూంది లోలోన.. 
అది ఈ రాత్రితోనే చల్లారునా 
మోజు ముదిరింది... రోజు కుదిరింది
ఆహా హా.. ఆ.. హహా హా..
లలల.. లలల్లలా 

Aadavaallu Meeku Joharlu : Okasare Okasare Song Lyrics (ఒకసారే... ఒకసారే...)

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్


పల్లవి:

ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే... మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు...
ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు

చరణం : 1

సూటిగా నాటేది మొదటి చూపు...
ఏ నాటికీ వినపడేది మొదటి పలకరింపు
సూటిగా నాటేది మొదటి చూపు...
ఏ నాటికీ వినపడేది మొదటి పలకరింపు
ఏదైనా మొదటిదే ఇంపైనది
రెండవది ఎన్నడూ కాదు మొదటిది
ఏదైనా మొదటిదే ఇంపైనది
రెండవది ఎన్నడూ కాదు మొదటిది
అందుకే అది ముద్దు... 
ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు

చరణం : 2

మొదటి పువ్వు చెపుతుంది తీగపడే సంబరం
మొదటి మెరుపు తెలుపుతుంది మబ్బులోని నిండుతనం
మొదటి పువ్వు చెపుతుంది తీగపడే సంబరం
మొదటి మెరుపు తెలుపుతుంది మబ్బులోని నిండుతనం
మొదటి చినుకులో వుంది వాన ముమ్మరం
మొదటి చినుకులో వుంది వాన ముమ్మరం
మొదలూ తుది లేనిదే ప్రేమ లక్షణం
అందుకే అది... ముద్దు
ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు

చరణం : 3

ముద్దనేది ప్రేమకు మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ లేపుతుంది నిద్దుర
ముద్దనేది ప్రేమకు మొదటి ముద్ర
ప్రేమనేది మనసునూ లేపుతుంది నిద్దుర
మేలుకున్న మనసుకు మేరనేది లేదు 
అది ప్రేమించేటందుకు ఈ సృష్టి చాలదు
మేలుకున్న మనసుకు మేరనేది లేదు 
అది ప్రేమించేటందుకు ఈ సృష్టి చాలదు
అందుకే అది... ముద్దు .. ముద్దు
ఒకసారే... ఒకసారే...
ఒకసారికి ఒకసారే.. మళ్ళీమళ్ళీ అడగొద్దు
మొదటిసారి తియ్యదనం రద్దుచేసుకోవద్దు
అప్పుడే అది ముద్దు... అప్పుడే అది ముద్దు

Aadavaallu Meeku Joharlu : Sagam Kalipoyanu Song Lyrics (సగం కాలిపోయాను... )

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

సగం కాలిపోయాను... సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము... ఈ జ్వాలలో నీ సగము కాలనీ
పాడుతూ కాలనీ...  ఆ పై మంటలే పాడనీ
సగం కాలిపోయాను... సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము... ఈ జ్వాలలో నీ సగము కాలనీ
పాడుతూ కాలనీ...  ఆ పై మంటలే పాడనీ

చరణం : 1

నీ కోసం నిను వలచి విలపించే వేదన కోసం
వెయ్యిసార్లు పుడతాను పదివేలసార్లు మరణిస్తాను
నెరవేరిన అనురాగం చల్లారిన నిప్పువంటిది
మన తరువాత అది మండుతు వుంటే...అంతకన్నా ఇంకేముంది
కాలనీ.. పాడుతూ కాలనీ...  ఆ పై మంటలే పాడనీ

చరణం : 2

ప్రతి దేహం ఒకనాడు కాలేదే చితిమంటలలో
బ్రతికుండగనే జరిగేదే వింతైనది మన బ్రతుకులలో
మనసులు కలవని యిద్దరిని... మంట ఒకటిగా చేస్తుంది
మనసులు కలవని యిద్దరిని... మంట ఒకటిగా చేస్తుంది
అగ్నిసాక్షిగా పెళ్ళంటే యింతకన్న యింకేముంది
కాలనీ.. పాడుతూ కాలనీ.. ఆపై మంటలే పాడనీ
సగం కాలిపోయాను... సగం కాలనున్నాను
ప్రేమలో నా సగము... ఈ జ్వాలలో నీ సగము... కాలనీ
పాడుతూ కాలనీ...  ఆ పై మంటలే పాడనీ




Aadavaallu Meeku Joharlu : Repu Maapu Song Lyrics (రేపు... మాపు... రూపు... మెరుపు)

చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు (1981)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: కె.వి. మహదేవన్



పల్లవి :

రేపు... మాపు... రూపు... మెరుపు
ఎరుపు.. పసుపు.. మైమరపు
ఆఁ... చూపు.. తూపు... తెలుపు.. నలుపు..
వలపు.. తలపు...  కలగలుపు
రేపు మాపు రూపు  మెరుపు
ఎరుపు పసుపు మైమరపు
చూపు  తూపు  తెలుపు  నలుపు 
వలపు తలపు  కలగలుపు
అరెం... ఆఁ... అలాకాదు...
రేపు.. మాపు.. తెలుపు.. నలుపు
ఎరుపు. .. పసుపు.. కలగలుపు
చూపు..  తూపు.. రూపు.. మెరుపు
వలపు.. తలపు... మైమరపు
రేపు మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు

చరణం : 1

పారు నీరు పేరు ఏరు
ఏరు చేరు మున్నీరు
కదులు ఎదలు కథలు నదులు
ఊహూ... కదిలే ఎదలో కథలా నదులు
ఆ కథలను చదివే చదువే చదువు 
రేపు .. మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు

చరణం : 2

మాట... తోట... ఆట.. పూట.. పాట.. తేట
తేట తేట మాటలతోట పాట
పూట పూట పాటలతోటి ఆట
తేట తేట మాటలతోట పాట
పూట పూట పాటలతోటి ఆట
మాటలకున్నది అర్థం
అవి కుప్పగ పోస్తే వ్యర్థం
ప్రతి మనిషికి ఉన్నది పరమార్థం
అది తెలియని బ్రతుకే అనర్థం 
రేపు మాపు తెలుపు నలుపు
ఎరుపు పసుపు కలగలుపు
చూపు తూపు రూపు మెరుపు
వలపు తలపు మైమరపు... మైమరపు