చిత్రం: అదృష్టవంతులు (1969)
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: కె. వి. మహదేవన్
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి :
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
చరణం 1 :
పెదవులు రెండూ కలగలిపినచో... తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో... మమతకు లేదు హద్దు

చూడు ఉబలాటం... ఆడు చెలగాటం
చూడు ఉబలాటం... ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్ను వద్దుర మొగమాటం
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
చరణం 2 :
ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...
ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్...
ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...
మోజు పడకుంటే మొగవాడెకాదోయ్...
గడసరి బిగువు సడలించనిచో... జవరాలే కాదు
ము..ము...ము..ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
ఇప్పుడొద్దనావంటే చిన్నవాడా... రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
ము..ము..ము..ము.. ముద్దంటే మోజే... ఇప్పుడావుద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా... అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ము..ము...ము.. ముద్దంటే చేదా... నీకావుద్దేశం లేదా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి