Adrushtavanthalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Adrushtavanthalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2022, శనివారం

Adrushtavanthalu : Mokkajonna Thotalo Song Lyrics (మొక్కజొన్న తోటలో..)

చిత్రం: అదృష్టవంతులు (1969)

సాహిత్యం: వెంకటరత్నం

గానం: పి.సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



మొక్కజొన్న తోటలో... ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా వేళ దాటి వస్తినా వెన్నక్కి తిరిగి పోతివా తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా.. గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తినా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా


1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Adrushtavanthalu : Ayyayyo Brahmayya Song Lyrics (అయ్యయ్యో బ్రహ్మయ్యా)

చిత్రం: అదృష్టవంతులు (1969)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల

సంగీతం: కె. వి. మహదేవన్




పల్లవి :

అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా..యా..యా..యా..యా.. అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా..యా..యా..యా..యా.. చరణం 1: చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు కొంత కోడెతనముంది..మరి కొంత ఆడతనముంది హోయ్‍ ..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా..యా..యా..యా..యా.. అయ్యయ్యో బ్రహ్మయ్యా ...... చరణం 2: మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు.. హాయ్..మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు.. ఆ కసరు లోనే అలకనవ్వుల విసురు లేక పోలేదు కొంత చిలిపితనముంది..మరి కొంత కలికితనముంది హోయ్‍.. అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా..యా..యా..యా..యా.. అయ్యయ్యో బ్రహ్మయ్యా ...... చరణం 3: బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా కవ్వించే కౌగిలిలో..కరగించక వదిలేరా హోయ్‍.. అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా అయా..యా..యా..యా..యా.. అయ్యయ్యో బ్రహ్మయ్యా ......