16, జనవరి 2025, గురువారం

Amarasilpi Jakkanna : Ee Nallani Raallalo Song Lyrics (ఈ నల్లని రాలలో )

చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)

గానం: ఘంటసాల

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు


పల్లవి: ఓహో ఓ ఓ.... ఓహోహో.... ఓ ఓ.... ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ .. చరణం 1: పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..ఈ నల్లని రాలలో చరణం 2: కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే.... ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..ఈ నల్లని రాలలో.. చరణం 3: పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..ఈ నల్లని రాలలో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి