చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)
గానం: పి. సుశీల
సాహిత్యం: దాశరథి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
పల్లవి: అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామీ.. అందాల బొమ్మతో ఆటాడవా.. పసందైన ఈ రేయి నీదోయి స్వామీ.. అందాల బొమ్మతో ఆటాడవా చరణం 1: కనులు చేపలై గంతులు వేసె.. మనసు తోటలో మల్లెలు పూసె.. దోసిట వలపుల పూవులు నింపీ.. దోసిట వలపుల పూవులు నింపీ నీ కోసము వేచితి రావోయీ.. అందాల బొమ్మతో ఆటాడవా... చరణం 2: చల్ల గాలితో కబురంపితిని ... చల్ల గాలితో కబురంపితిని... చందమామలో వెదకితి నోయీ... తార తారనూ అడిగితి నోయీ.... దాగెద వేలా? రావోయీ... అందాల బొమ్మతో ఆటాడవా... చరణం 3: నల్లని మేఘము జల్లు కురియగా... నల్లని మేఘము జల్లు కురియగా... ఘల్లున ఆడే నీలినెమలినై.... నిను గని పరవశమందెద నోయీ... కనికరించి ఇటు రావోయీ... అందాల బొమ్మతో ఆటాడవా.. పసందైన ఈ రేయి నీదోయి స్వామీ.. అందాల బొమ్మతో ఆటాడవా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి