16, జనవరి 2025, గురువారం

Amarasilpi Jakkanna : Nagumomu Choopinchavaa Song Lyrics (నగుమోము చూపించవా గోపాలా)

చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)

గానం: పి. సుశీల

సాహిత్యం: సి.నారాయణరెడ్డి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు


పల్లవి: నగుమోము చూపించవా గోపాలా నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల ఉడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ చరణం 1: ఎదుట … ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట... ఎదుట వెన్నెల పంట.. ఎదలో తీయని మంట ... ఎదుట వెన్నెల పంట... ఎదలో తీయని మంట... ఇక సైపలేను నీవే నా... ముద్దుల జంట నగుమోము చూపించవా గోపాలా….. చరణం 2: వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ... వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ... మగనాలిపై ఇంత బిగువూ చూపెదవేల.. నగుమోము చూపించవా గోపాలా …. చరణం 3: కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య... కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య... నెలవంకలిడి నన్ను అలరించవేమయ్య... నగుమోము చూపించవా గోపాలా … నగుమోము చూపించవా గోపాలా మగువల మనసుల ఉడికింతువేలా నగుమోము చూపించవా గోపాలా..ఆ..ఆ..ఆ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి