చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)
గానం: ఘంటసాల, పి. సుశీల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
పల్లవి: నిలువుమా నిలువుమా నీలవేణీ నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ నిలువుమా నిలువుమా నీలవేణీ చరణం 1: అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా తడబడే అడుగుల నటనల మురిపింపులా తడబడే అడుగుల నటనల మురిపింపులా సడిసేయక ఊరించే... సడిసేయక ఊరించే... ఒయారపు ఒంపులా కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా నడచిరా నడచిరా నాగవేణీ నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ చరణం 2: అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ.. అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి నా ఊర్వశి రావే రావే అని పిలువనా నా ఊర్వశి రావే రావే అని పిలువనా ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా నా చెలి నిను మదీ దాచుకోనీ నా చెలి నిను మదీ దాచుకోనీ నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ..
నిలువుమా నిలువుమా నీలవేణీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి