30, జనవరి 2025, గురువారం

Ammayi manasu : Oka Venu Geetham Palikindi Song Lyrics (ఒక వేణు గీతం పలికింది )

చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీత రచయిత :  మైలవరపు గోపి

నేపధ్య గానం :  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి :

హా.. ఆ.. ఆ.. హా
ఆ.. ఆ.. ఆ.. హో..ఓ.. ఓ..
లాలలాలలా... ఆ.. హా 
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చరణం 1 :

అలలై బంగారు కలలై...  మిగిలే అందాలు కొన్ని
వనవాటిలో సెలయేటిలాగ నను తొందరించసాగే
ఎదలో ఏ మూలలోనో...  కదిలే భావాలు కొన్ని
నా గుండె నుంచి... లోగొంతు నుంచి... నా పెదవి పైకి చేరే
లాలించే పాటలాగా.. హో

ఒక వేణు గీతం....  పలికింది పాటై
ఎద పల్లవించగా....  ఈవేళ నాలో


చరణం 2 :

హృదయం కోరేది స్నేహం.. స్నేహం నూరేళ్ళ దీపం
మనసున్న మనిషి తోడైన వేళ... నీదే అందాల లోకం
ప్రణయం వసంతమైతే... బ్రతుకే పూదోట కాదా
మనసులో మాట చూపులో తెలిసే.. ఎందుకో ఇంక మౌనం
ఆ మౌనం ప్రేమ భాష్యం... ఊ...

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి