Ammayi Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ammayi Manasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జనవరి 2025, గురువారం

Ammayi manasu : Oka Venu Geetham Palikindi Song Lyrics (ఒక వేణు గీతం పలికింది )

చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీత రచయిత :  మైలవరపు గోపి

నేపధ్య గానం :  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి :

హా.. ఆ.. ఆ.. హా
ఆ.. ఆ.. ఆ.. హో..ఓ.. ఓ..
లాలలాలలా... ఆ.. హా 
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చరణం 1 :

అలలై బంగారు కలలై...  మిగిలే అందాలు కొన్ని
వనవాటిలో సెలయేటిలాగ నను తొందరించసాగే
ఎదలో ఏ మూలలోనో...  కదిలే భావాలు కొన్ని
నా గుండె నుంచి... లోగొంతు నుంచి... నా పెదవి పైకి చేరే
లాలించే పాటలాగా.. హో

ఒక వేణు గీతం....  పలికింది పాటై
ఎద పల్లవించగా....  ఈవేళ నాలో


చరణం 2 :

హృదయం కోరేది స్నేహం.. స్నేహం నూరేళ్ళ దీపం
మనసున్న మనిషి తోడైన వేళ... నీదే అందాల లోకం
ప్రణయం వసంతమైతే... బ్రతుకే పూదోట కాదా
మనసులో మాట చూపులో తెలిసే.. ఎందుకో ఇంక మౌనం
ఆ మౌనం ప్రేమ భాష్యం... ఊ...

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో

Ammayi manasu : Manase Dochavu Neevu Song Lyrics (మనసే దోచావు నీవు)

చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీత రచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల



పల్లవి:

మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..
ఉన్నా నీలోనే ఉన్నా.. ఏది కాలేక ఉన్నా
మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..

చరణం 1:

తలుపులు తెరిచింది నీవు
వెలుగులు తెచ్చింది నీవు
ఇంటిని కంటిని వెలిగించి వెళ్ళినావు 
వెన్నెల చిరుజల్లు చిలికి
కన్నుల వాకిళ్ళు అలికి
నవ్వుల ముగ్గులు ఎన్నెన్నో వేసినావు
కలవై కళవై  మిగిలి
మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి.. నను మరచి
నీ మనిషై ఉన్నాను..

చరణం 2:

ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
సరిగమ ఏడే స్వరాలూ 
నడిచినవి ఏడే అడుగులు
మరవకు చెరపకు.. నూరేళ్ళ జ్ఞాపకాలు 
మరవకు మన ప్రేమ గీతం..
మాపకు తొలి ప్రేమ గాయం
నీవని నేనని విడతీసి ఉండలేవు
ఆరో ప్రాణం నీవు 
మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి నను మరచి నీ మనిషై ఉన్నాను
ఉన్నా నీలోనే ఉన్నా.. వేరే కాలేక ఉన్నా ..
మనసే దోచావు నీవు
మనిషే మిగిలాను నేను
అది తెలిసి నను మరచి నీ మనిషై ఉన్నాను

Ammayi manasu : Mee Palle Repallega Song Lyrics (మీ పల్లే వ్రేపల్లెగా.)

చిత్రం : అమ్మాయి మనసు (1987)

సంగీతం : రాజన్-నాగేంద్ర

గీత రచయిత :  వేటూరి

నేపధ్య గానం :  ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ
హా ఆ ఆ... హా హా ఓ హో.. ఆ ఆ ఆ హా ఆ ఆ .. ఆ ఆ
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా

చరణం 1 :

నెమిలమ్మకు సిరిమువ్వలే
కరిమబ్బుల నీడలోనా.. తొడగాలని కోరుకున్న
కుహూ అమ్మకు పులకింతగా
మావి చిగురించు వేళ.. పూదండలే అల్లుకున్న 
గుబురైన కొమ్మని... కుదురైన గూడుగా
గుబురైన కొమ్మని... కుదురైన గూడుగా
కోరింది గోరింట
ఓ.. ఓ.. ఓ..
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా


చరణం 2 :

మలిసందెల తిలకాలతో
అందాల తొలి పూజ చేసి... మరి వెళ్ళాడే బాటసారి
అల ఆడగా.. సెల పాడగా..
నా ఊహ ఊయలలూగి మరిపించనా పాట పాడి

సన్నాయి సొగసుల... అమ్మాయి మనసులా
సన్నాయి సొగసుల... అమ్మాయి మనసులా
సురపొన్నలే పూయగా
ఓ.. ఓ.. ఓ..
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
పిలిచింది నన్నే బృందావని.. పరదేశిననా రారమ్మని
మీ పల్లే వ్రేపల్లెగా.. నీ గోము గోపెమ్మగా
నీ గోము గోపెమ్మగా...