చిత్రం: ఆనంద భైరవి (1983)
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. పి..శైలజ
పల్లవి :
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
ఆ.. ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా
చరణం 1 :
మట్టి మీద పుట్టేనాడు.. మట్టిలోన కలిసేనాడు
మట్టి మీద పుట్టేనాడు.. మట్టిలోన కలిసేనాడు
పొట్ట షాత పట్టందే ఓ రయ్యో...
గిట్టుబాటు కాదీ బ్రతుకు ఇనరయ్యో...
గిట్టుబాటు కాదీ బ్రతుకు ఇనరయ్యో...
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా
చరణం 2 :
గుడ్డు కన్ను తెరిచేనాడు... రెక్కలొచ్చి ఎగిరేనాడు
గుడ్డు కన్ను తెరిచేనాడు... రెక్కలొచ్చి ఎగిరేనాడు
జోలెపట్టి అడగందే ఓలమ్మో...
కత్తి మీద సామీ బ్రతుకు ఇనవమ్మో...
కత్తి మీద సామీ బ్రతుకు ఇనవమ్మో...
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
ఆ.. ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి