చిత్రం: ఆనంద భైరవి (1983)
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు
నిసగ సగమ గమ పదనిప మప గా...
పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి
పలికే మరందాల అమృత వర్షిణి...
చైత్ర ముకుసుమంజలి...
చరణం 1:
వేసవి లో అగ్ని పత్రాలు రాసి
విరహిణి నిట్టూర్పు లాకొంత సాగి
గగగా గగనిదమగ సరిగా...
గాగ సాస మాద మదస...
వేసవి లో అగ్ని పత్రాలు రాసి
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
జలద నినాదాల పలుకు మృదంగాల
బాషుక జలకన్య లా తేలి ఆడి
నర్తనకి కీర్తనకి నాట్య కళా భారతి కి....
చైత్ర ముకుసుమంజలి...
పమగస నిసగమ చైత్ర ముకుసుమంజలి...
చరణం 2:
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
గగగా గదనిదమగ సరిగా...
గాగ సాస గాగ మాద మదస...
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
హిమ జల పాతాల సుమ శర బాణాల
హిమ జల పాతాల సుమ శర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
సరి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికి
చైత్ర ముకుసుమంజలి..
పమ గస నిస గమ..
చైత్ర ముకుసుమంజలి...