9, జనవరి 2025, గురువారం

Andala Ramudu : Paluke Bangaramayera Song Lyrics (పలుకే బంగారమాయెరా)

చిత్రం : అందాల రాముడు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీత రచయిత : ఆరుద్ర

గానం  : బాల మురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం


పల్లవి :

పలుకే బంగారమాయెరా... అందాల రామ.. పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 
ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే... పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా

చరణం 1 :

లక్షాధికారులైనా లవణమన్నమే గాని
బంగారు కణికలు... మింగలేరను మంచి... పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 
చిన్ని నా బొజ్జకు... శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని.. అందరికుండాలనే.. పలుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 

చరణం 2 :

బిరుదులు పదవుల మీద...  పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న... ఎరుకే బంగారమాయెరా
అందాల రామ... పలుకే బంగారమాయెరా 
పంచదారను మించే... పాలూ మీగడల మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే... పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా... అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి