9, జనవరి 2025, గురువారం

Andala Ramudu : Samooha Bhojanammu Song Lyrics (సమూహ భోజనంబు.. )

చిత్రం : అందాల రాముడు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీత రచయిత : కొసరాజు

గానం  : రామకృష్ణ


పల్లవి :

సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు      
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు         


చరణం 1 :

గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు..
అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. 
అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం..
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం..
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం
ఈ గొణుగుచున్న ఘనులు.. కడు మూర్ఖ శిఖామణులు        
       
సమూహ భోజనంబు...  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు 
       
చరణం 2 :

అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు...
ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు...
ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప..
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప
కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా..
ఆలోచనలను పెంచు.. ఆవేశములను దించు 
              
సమూహ భోజనంబు...  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు   

చరణం 3 :

దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు..
రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. 
రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు..
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు..
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు
కోపాలు సర్దుకోండి... సాపాటు పంచుకోండి
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు      
సమూహ భోజనంబు.. సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి