చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి :
చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా
అహా... చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మ
మెత్తామెత్తాంగ వచ్చి చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ
చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా
పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
అహా... పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
ముచ్చల్లే వచ్చి వచ్చి మత్తేదో చల్లెనమ్మా
పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
చరణం 1 :
టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... ఆకుతేలల్లే వస్తాడు
టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... ఆకుతేలల్లే వస్తాడు
సోకంతా చూపుల్లో చూపుతాడు... ఆ చూపులతో ఒళ్ళంతా పాకుతాడు
అరెరరె...
పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది
పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది
నవ్వుల్లో బాణాలు రువ్వుతుంది... రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది
చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా
మెత్తామెత్తాంగ వచ్చి చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ
పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
చరణం 2 :
వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో
వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో
దీపమల్లె వెలుగుతుంది దీవిలో.. తెరచాపలాగ ఎగురుతుంది నావలో
ఆ.. అలలు అలలుగా ఊగుతాడు మనసులో... కలలు కలలుగా వస్తాడు కళ్ళలో
అలలు అలలుగా ఊగుతాడు మనసులో... కలలు కలలుగా వస్తాడు కళ్ళలో
కడలిలాగా ఉంటాడు లోతులో... చెలమలాగ ఊరుతాడు చెలిమిలో
పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
ముచ్చల్లే వచ్చి వచ్చి మత్తేదో చల్లెనమ్మా
పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా
అరెరె.. చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి