Andaman Ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Andaman Ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Andaman Ammayi : Ee Kovela Neekai Song Lyrics (ఈ కోవెల నీకై వెలిసింది.. )

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల




పల్లవి : ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలి రా.. నా దేవి తరలిరా ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా స్వామీ తరలి రా.. నా స్వామి తరలిరా చరణం 1 : దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను తూరుపులాగా ఉన్నాను ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలి రా..నా దేవి తరలిరా చరణం 2 : నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే ఆ..దేవుడేదో అడ్డువేసే ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా

Andaman Ammayi : Vestaanu Podupukatha Song Lyrics (వేస్తాను పొడుపు కథా)

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల




పల్లవి : వేస్తాను పొడుపు కథా... వేస్తాను చూస్తాను విప్పుకో... చూస్తాను మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి వేస్తాను పొడుపు కథా... వేస్తాను చూస్తాను విప్పుకో... చూస్తాను మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి చరణం 1 : వచ్చాక వచ్చారు... వచ్చి వెళ్ళిపోయరు వెళ్ళి మళ్ళి వచ్చారు... మళ్ళి వెళ్తే వస్తారా వచ్చాక వచ్చారు... వచ్చి వెళ్ళిపోయరు వెళ్ళి మళ్ళి వచ్చారు... మళ్ళి వెళ్తే వస్తారా... ఆ ఎవరు వారు? ... ఎవరు వారు? తెలిలా... ఉ.. ఇంకా తెలిలే.. ఊహూ...తెలిలా ఈ... పళ్ళూ... హేయ్.. ఓడిపోయావ్.. ఓడిపోయావ్... ఆ...హహహాహా వేస్తాను పొడుపు కథా... వేస్తాను చూస్తాను విప్పుకో... చూస్తాను మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి చరణం 2 : పగడాలా చక్రాల పచ్చని తేరునెక్కి సూర్యుడంటి వీరుడొస్తే... దారంతా నెత్తురంటా పగడాలా చక్రాల పచ్చని తేరునెక్కి సూర్యుడంటి వీరుడొస్తే... దారంతా నెత్తురంటా ఏమిటంటా? ... ఏంటబ్బా? ఊ.. తెలీలా... ఊహూ... ఇదీ తెలీలేదా... ఊహూ... వక్కా... ఆకు... సున్నం... ఆకు... వక్కా... సున్నం...హహాహా వేస్తాను పొడుపు కథా... వేస్తాను చూస్తాను విప్పుకో... చూస్తాను మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి చరణం 3 : పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి... పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక్కటైనవి... పుట్టిన ప్రతి జీవికి తప్పకున్నవి కాయైనా.. పండైనా... కాయైనా పండైనా తియ్యనైనవి గాయమైనా మందైనా తానైనది ఏవిటదీ? ... ఏవిటబ్బా? తెలీలా...ఊహూ... ఇంకా తెలీలా... తెలీలా... హహా ప్రేమా.... ఏయ్... ఓడిపోయావ్.. ఓడిపోయావ్... హహా వేస్తాను పొడుపు కథా... వేస్తాను చూస్తాను విప్పుకో... చూస్తాను మనం వేసుకొన్న పొడుపు కథా ఈ రాత్రి అది విప్పుకొని తప్పుకొంటే శివరాత్రి చరణం 4 : నేల మీద నిలిచేది రెండు కాళ్ళు నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు నేల మీద నిలిచేది రెండు కాళ్ళు నింగిలోన నిలిచేవి రెండు కాళ్ళు మధ్యలో నడిచేవి ఎన్నో కాళ్ళు ఏవిటది? ... ఆ.. ఏవిటది? తెలీలా..ఊహూ.. తేలీలా... అహా హేయ్.. నాకూ తెలీదు... నీకూ తెలీదు... అయితే ఓడిపోయావ్... ఏవీ లేదు... నువ్వే ఓడిపొయావ్.. మీరే ఓడిపోయారు...హహాహా

Andaman Ammayi : Chitra Chitrala Bomma Song Lyrics (చిత్రచిత్రాల బొమ్మా )

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల




పల్లవి : చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా అహా... చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మ మెత్తామెత్తాంగ వచ్చి చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా అహా... పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా ముచ్చల్లే వచ్చి వచ్చి మత్తేదో చల్లెనమ్మా పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా చరణం 1 : టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... ఆకుతేలల్లే వస్తాడు టేకు మానల్లే చల్లంగ ఉంటాడు... ఆకుతేలల్లే వస్తాడు సోకంతా చూపుల్లో చూపుతాడు... ఆ చూపులతో ఒళ్ళంతా పాకుతాడు అరెరరె... పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది పువ్వు తీగల్లే నాజూగ్గా ఉంటుంది... బొండుమల్లెల్లే నిండుగా నవ్వుతుంది నవ్వుల్లో బాణాలు రువ్వుతుంది... రువ్వుతూ ప్రాణాలు తోడుతుంది చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోత బొమ్మా మెత్తామెత్తాంగ వచ్చి చిత్తాన్నే దోచెనమ్మా... ఆ.. ఆ పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా చరణం 2 : వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో వాడిబాకల్లే గుచ్చుతుంది గుండెలో... లేడిపిల్లల్లే గెంతుతుంది ఇంతలో దీపమల్లె వెలుగుతుంది దీవిలో.. తెరచాపలాగ ఎగురుతుంది నావలో ఆ.. అలలు అలలుగా ఊగుతాడు మనసులో... కలలు కలలుగా వస్తాడు కళ్ళలో అలలు అలలుగా ఊగుతాడు మనసులో... కలలు కలలుగా వస్తాడు కళ్ళలో కడలిలాగా ఉంటాడు లోతులో... చెలమలాగ ఊరుతాడు చెలిమిలో పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా ముచ్చల్లే వచ్చి వచ్చి మత్తేదో చల్లెనమ్మా పైలాపచ్చీసు బొమ్మా.. పరదేశి ఆటబొమ్మా అరెరె.. చిత్రచిత్రాల బొమ్మా పుత్తడి పోతబొమ్మా