18, జనవరి 2025, శనివారం

Andaman Ammayi : Ee Kovela Neekai Song Lyrics (ఈ కోవెల నీకై వెలిసింది.. )

చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)

సంగీతం : కె.వి. మహదేవన్

రచన : ఆచార్య ఆత్రేయ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల




పల్లవి : ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలి రా.. నా దేవి తరలిరా ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా స్వామీ తరలి రా.. నా స్వామి తరలిరా చరణం 1 : దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను దేవత గుడిలో లేకున్నా దీపం పెడుతూ ఉన్నాను తిరునాళ్ళేపుడో రాక తప్పదని తేరును సిద్ధం చేసాను దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను దేవుడు వస్తాడని రోజూ పూవులు ఏరి తెస్తున్నాను రేపటి కోసం చీకటి మూసిన తూరుపులాగా ఉన్నాను తూరుపులాగా ఉన్నాను ఈ కోవెల నీకై వెలిసింది..ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలి రా..నా దేవి తరలిరా చరణం 2 : నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే నీరు వచ్చే ఏరు వచ్చే..ఏరు దాటే ఓడ వచ్చే ఓడ నడిపే తోడు దొరికే ఒడ్డు చేరే రోజు వచ్చే ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే ఓడ చేరే రేవు వచ్చే నీడ చూపే దేవుడొచ్చే రేవులోకి చేరేలోగా దేవుడేదో అడ్డువేసే ఆ..దేవుడేదో అడ్డువేసే ఈ కోవెల నీకై వెలిసింది.. ఈ వాకిలి నీకై తెరిచింది రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా రా దేవి తరలిరా.. నా స్వామీ తరలిరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి